Telangana Budget 2022 : బడ్జెట్ ప్రసంగాన్ని బైకాట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

Published : Mar 07, 2022, 01:20 PM IST
Telangana Budget 2022 : బడ్జెట్ ప్రసంగాన్ని బైకాట్ చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు..

సారాంశం

నేటినుంచి ప్రారంభమైన తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ సారి గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఇక కాంగ్రెస్ కూడా బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరించడం ద్వారా తమ నిరసనను వ్యక్తం చేసింది. 

హైదరాబాద్ : శాసనసభలో మంత్రి Minister Harish Rao బడ్జెట్ ప్రసంగాన్నిCongress MLAs బహిష్కరించారు. budget meetings నిబంధలు పాటించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంగిస్తున్నారని ఆరోపించారు. Point of order కు మైక్ ఇవ్వకపోవడంమీద కాంగ్రెస్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్.. సభ్యుల సభా గౌరవాన్ని పాటించడం లేదని ఆరోపించారు. స్పీకర్ సభను ఏకపక్షంగా నడుపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. 

ఇదిలా ఉండగా, టీఆర్ఎస్ నుంచి బైటికి వచ్చి.. బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత మొదటిసారి అసెంబ్లీకి వెడుతున్న ఈటెల రాజేందర్ ముందుగా.. టాంక్ బండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆ తరువాత గన్ పార్క్ లో తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, రఘునందన్ రావు కూడా పాల్గొన్నారు. 

ప్రజాసంక్షేమ విధాన పత్రమే గవర్నర్ గారి ప్రసంగం అని..  దీనిమీద చర్చించడం ఎమ్మెల్యే గా మా హక్కు అంటూ నినదించారు. కానీ కెసిఆర్ 40 సంవత్సరాలుగా వస్తున్న విధానాన్ని తుంగలో తొక్కి ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేశారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ సెషన్స్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే.  

అంతేకాదు తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ గారికే దిక్కులేకుండా చేస్తే మా పరిస్థితి ఏంటో మాకు అర్థం అవుతుందని అన్నారు. మాట్లాడుతుంటే మైకులు కట్ చేసి అవమానిస్తారు. ఇక ఈ సారి మాట్లాడే అవకాశం ఇస్తారో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో గంటల తరబడి మాట్లాడే అవకాశం మాకు ఎప్పుడు దక్కింది. ఇప్పుడు మేము ముగ్గురం కావొచ్చు... కానీ రాబోయేది బీజేపీ ప్రభుత్వం... రాష్ట్రంలో నియంతృత్వ, దోపిడీ పాలన కొనసాగుతుంది.  అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం రాకపోతే
ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అంటూ హెచ్చరించారు. 

ప్రజల సమస్యలు పరిష్కరించడానికి మా శక్తి మేరకు ప్రయత్నం చేస్తామని హామీ ఇస్తున్నాం. కెసిఆర్ గారు ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించండి. లేదంటే రేపు మీకు కూడా అదే గతి పడుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

కాగా, తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే బీజేపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సమావేశాలు ముగిసేవరకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే శాసనసభలో మంత్రి హరీష్ రావు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం కొనసాగిస్తుండగా బీజేపీ సభ్యులు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు తన ప్రసంగానికి స్వల్ప విరామం ఇచ్చారు. 

బీజేపీ సభ్యులు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటల రాజేందర్‌లను ఈ సెషన్ ముగిసేవరకు శాసనసభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ శాసనసభ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రావు తీర్మానాన్ని ప్రతిపాదించగా.. ఇందుకు స్పీకర్ పోచారం ఆమోదం తెలిపారు. మొత్తం ముగ్గురు బీజేపీ సభ్యులను ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. బీజేపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం హరీష్ రావు సభలో తన బడ్జెట్ ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.శాసనసభ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు అసెంబ్లీ గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేశారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఈ ఐదు జిల్లాలకు పొంచివున్న పిడుగుల గండం... తస్మాత్ జాగ్రత్త
IndiGo Airlines Hyderabad: ఇండిగో విమానాలు ఆలస్యం.. ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం | Asianet News Telugu