హుజురాబాద్‌లో టీఆర్ఎస్ దండుపాళ్యం... ఈటల జోలికి వస్తే: కేసీఆర్‌కి సంజయ్ వార్నింగ్

By Siva KodatiFirst Published Jun 19, 2021, 7:12 PM IST
Highlights

బీజేపీలోకి ఈటల రాజేందర్‌ను రమ్మని ఎప్పుడో చెప్పానని అన్నారు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ దండుపాళ్యం హుజురాబాద్‌లో అడుగుపెట్టిందని సంజయ్ అన్నారు

బీజేపీలోకి ఈటల రాజేందర్‌ను రమ్మని ఎప్పుడో చెప్పానని అన్నారు తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ దండుపాళ్యం హుజురాబాద్‌లో అడుగుపెట్టిందని సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబం మాత్రమే టీఆర్ఎస్‌కి ఓనర్లులా వున్నారని ఆయన ఆరోపించారు. సర్పంచ్‌తో మాట్లాడే స్థాయికి కేసీఆర్ చేరారంటే అది ఈటల దెబ్బేనని సంజయ్ ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందని.. హుజురాబాద్‌లో ఈటల అభివృద్ధి చేయకుండానే 6 సార్లు గెలిచారా అని ఆయన ప్రశ్నించారు. రాజేందర్ జోలికొస్తే సీఎం కేసీఆర్ గడీలు బద్దలు కొడుతామని బండి సంజయ్‌ హెచ్చరించారు. ఉద్యమకారులకు ఏకైక వేదిక బీజేపేయేనని స్పష్టం చేశారు. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయడమే తమ లక్ష్యమని సంజయ్‌ ప్రకటించారు. కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ము బీజేపీకే ఉందని స్పష్టం చేశారు. 

Also Read:హుజురాబాద్: ఈటల రాకపై అసంతృప్తి.. బీజేపీ ముఖ్య సమావేశానికి పెద్దిరెడ్డి డుమ్మా

అంతకుముందు ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. జెండాకి ఒక వ్యక్తి ఓనర్ ఉండడు అని చెప్పానని గుర్తుచేశారు. ఏ పార్టీలో అయినా కార్యకర్త కూడా జెండాకి ఓనరే అని చెప్పాల్సిందేనన్నారు. ఇదే హుజురాబాద్‌లో నేను కూడా ఓనరేనని చెప్పానని ఈటల వ్యాఖ్యానించారు. హుజురాబాద్ ప్రజలు తనను ఆరుసార్లు గెలిపించారని రాజేందర్ అన్నారు. హుజురాబాద్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందని ఈటల జోస్యం చెప్పారు. తమ హక్కులకు భంగం కలిగితే దేనికైనా రెడీగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అధికారం నెత్తికెత్తి అహంకారంతో మాట్లాడుతున్నారని రాజేందర్ ఆరోపించారు. 
 

click me!