హుజురాబాద్: ఈటల రాకపై అసంతృప్తి.. బీజేపీ ముఖ్య సమావేశానికి పెద్దిరెడ్డి డుమ్మా

By Siva KodatiFirst Published Jun 19, 2021, 6:20 PM IST
Highlights

హుజురాబాద్ బీజేపీలో అలకలు మొదలయ్యాయి. బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరడంతో అక్కడి పార్టీ నేతలు అలకబూనారు. ఇవాళ జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పెద్దిరెడ్డి డుమ్మాకొట్టారు. 

హుజురాబాద్ బీజేపీలో అలకలు మొదలయ్యాయి. బీజేపీలోకి మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరడంతో అక్కడి పార్టీ నేతలు అలకబూనారు. ఇవాళ జరిగిన బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశానికి పెద్దిరెడ్డి డుమ్మాకొట్టారు. బీజేపీలోకి ఈటల రాకను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డి.. కావాలనే ముఖ్యకార్యకర్తల సమావేశానికి దూరంగా వున్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా బీజేపీలో చేరిన ఈటలను పెద్దిరెడ్డి ఇప్పటి దాకా కలవలేదు. ఇటు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆయనను మెత్తబరిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా.. ఆయన తీరులో మాత్రం మార్పు రావడం లేదు. అటు పెద్దిరెడ్డి అనుచరులు సైతం బీజేపీ కార్యక్రమాలకు వెళ్లాలా లేదా అన్న అయోమయంలో పడ్డారు. 

హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తనకు టికెట్టు ఇస్తానని హామీ ఇచ్చిందని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఇనుగాల పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం నాడు ఓ తెలుగున్యూస్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. హుజూరాబాద్ ఎన్నికలు భిన్నమైనవని ఆయన చెప్పారు.

Also Read:నాకే సీటిస్తానని హామీ: హుజూరాబాద్ బైపోల్స్‌పై పెద్దిరెడ్డి సంచలనం

ప్రజల ఆకాంక్షల మేరకు తాను  నడుచుకొంటానని ఆయన  ప్రకటించారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జీగా ఉన్న  తనకు సమాచారం లేకుండానే కార్యక్రమాలు సాగుతున్న విషయమై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు పార్టీ కార్యక్రమాలకు  తాను హాజరౌతున్నట్టుగా ఆయన తెలిపారు.బీజేపీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను తాను పాటిస్తానని ఆయన చెప్పారు. తనకు పార్టీతో భిన్నాభిప్రాయాలు లేవని ఆయన స్పష్టం చేశారు. 
 

click me!