గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బీజేపీ నేతలు.. రాష్ట్రపతి పాలన కోరతారా..?

By sivanagaprasad KodatiFirst Published Sep 6, 2018, 1:08 PM IST
Highlights

తెలంగాణలో క్షణ క్షణం రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి ప్రకటన వెలువడుతుందా అని నేతలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలు కేసీఆర్ గవర్నర్‌ను కలిసిన తర్వాత జరగబోయే పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.

తెలంగాణలో క్షణ క్షణం రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఏ క్షణంలో ఎలాంటి ప్రకటన వెలువడుతుందా అని నేతలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అన్ని పార్టీలు కేసీఆర్ గవర్నర్‌ను కలిసిన తర్వాత జరగబోయే పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేతలు గవర్నర్‌ కలవాలని నిర్ణయించారు.

ఇప్పటికే వారు గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు. ఒకవేళ అసెంబ్లీ రద్దు అయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని కోరే అవకాశం కనిపిస్తోంది. నిన్న మీడియా సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడిన మాటలు ఇందుకు బలాన్నిస్తున్నాయి. ప్రభుత్వాన్ని రద్దు చేసే వరకు కేసీఆర్‌కు అధికారం ఉంటుందని.. ఆ తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తారా..? ఎన్నికలు ఉంటాయా అన్నది రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకుంటారని లక్ష్మణ్ అన్నారు. 

click me!