ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ: అసెంబ్లీ రద్దుపైనే తీర్మానం?

Published : Sep 06, 2018, 01:06 PM ISTUpdated : Sep 09, 2018, 01:30 PM IST
ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ భేటీ: అసెంబ్లీ రద్దుపైనే తీర్మానం?

సారాంశం

 తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది


హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. గురువారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానాన్ని ఈ సమావేశంలో కేబినెట్ ఆమోదం తెలపనుంది.

అసెంబ్లీని రద్దు అంశంపైనే  ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఈ విషయమై అసెంబ్లీ రద్దు తీర్మానం కాపీని సీఎం కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి ప్రత్యేక బస్సులో రాజ్ భవన్ కు వెళ్లి  గవర్నర్ కు ఇవ్వనున్నారు.

ఏ పరిస్థితుల్లో ముందస్తుగా అసెంబ్లీని రద్దు చేయాల్సి వచ్చిందో అనే విషయమై కేసీఆర్ గవర్నర్ వివరించనున్నారు. గవర్నర్ ను కలిసిన తర్వాత  కేసీఆర్  తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించనున్నారు.

అక్కడి నుండి నేరుగా  సీఎం టీఆర్ఎస్  భవన్ లో మీడియాతో మాట్లాడనున్నారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించిన విషయాలను కేసీఆర్ మీడియాకు వివరించనున్నారు.

 

PREV
click me!

Recommended Stories

Real estate: హైద‌రాబాద్‌లోని ఈ శివారు ప్రాంతం మ‌రో కూక‌ట్‌ప‌ల్లి కావ‌డం ఖాయం.. ఇప్పుడే కొనేయండి
Free Bus Scheme : తెలుగోళ్లకు గుడ్ న్యూస్... మహిళలకే కాదు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం