రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై టీ బీజేపీ నేతల రియాక్షన్ ఇదే.. ‘ఆయన అనుకుంటే సరిపోతుందా?’

By Mahesh K  |  First Published Oct 25, 2023, 4:08 PM IST

రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంపై టీబీజేపీ నేతలు రియాక్ట్ అయ్యారు. బీజేపీ పోటీలో లేదని, బీఆర్ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదని రాజగోపాల్ రెడ్డి అనుకుంటే సరిపోతుందా? అంటూ ప్రశ్నించారు. 
 


హైదరాబాద్: కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నట్టు వెల్లడించారు. ఎల్లుండి ఉదయం ఆయన చేరిక ఉంటుందని తెలుస్తున్నది. ఆయన ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీలో చేరకముందే తన సొంత నియోజకవర్గ అభ్యర్థిత్వమే కాదు, సీఎం కేసీఆర్‌పైనా పోటీ చేయడానికీ అవకాశం ఇవ్వాలని కేసీ వేణుగోపాల్‌ను కోరినట్టు తెలిసింది. గంటల వ్యవధిలోనే ఈ రాజకీయం జరిగింది. 

రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని, బీఆర్ఎస్‌ను బలంగా ఢీకొట్టగలిగే పార్టీ బీజేపీ మాత్రమేనని రాజగోపాల్ రెడ్డి గతంలో పేర్కొన్నారు. అందుకే తాను బీజేపీలో చేరబోతున్నట్టూ వివరించారు. కానీ, తాజాగా, తన రాజీనామా లేఖలోనూ ఈ కోణంలోనే కారణాన్ని ప్రస్తావించారు. గత కొన్ని నెలల్లో రాజకీయ పరిణామాలు మారాయని, ఇప్పుడు బీఆర్ఎస్‌ను ఢీకొట్టగలిగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుందని వివరించారు. ఈ మార్పు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై టీబీజేపీ నేతలు కొందరు స్పందించారు.

Latest Videos

రాజగోపాల్ రెడ్డి రాజీనామాపై టీబీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. ఎవరి ఇష్టం వారిది. పార్టీ మారే హక్కు వారికి ఉంటుంది. బీజేపీలో పోటీ లేదని వారు అనుకుంటే సరిపతుందా? వివరించారు. రాజగోపాల్ రాజీనామా ఇంకా చదవలేదని ఈటల రాజేందర్ అన్నారు. బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు ఎలా తన వైఖరి మార్చుకున్నారని ప్రశ్నించారు.

రాజగోపాల్ రెడ్డి శరీరం బీజేపీలో ఉంటే ఆత్మ కాంగ్రెస్‌లోనే ఉండిపోయిందని, అందుకే ఇప్పుడు ఆయన రాజీనామా చేశారని, ఇది అందూర ఊహించినదే అని బూర నర్సయ్య వివరించారు. ఆయన భావించినంత మాత్రానా బీఆర్ఎస్‌కు బీజేపీ ఆల్టర్నేట్ కాకుండా పోతుందని తెలిపారు.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా విషయం తనకు తెలియదని మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను పార్టీ మారుతాననే ప్రచారం అవాస్తవం తాను పెద్దపల్లి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు.

Also Read: రక్తం ఎక్కించిన 14 మంది పిల్లలకు హెచ్ఐవీ.. బీజేపీ ప్రభుత్వంపై మల్లికార్జున్ ఖర్గే ఫైర్

రాజగోపాల్ రెడ్డి కేవలం పాసింగ్ క్లౌడ్ అని, కానీ, పార్టీ మాత్రం బలంగా ఉంటుందని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. తాను ఎంపీగా పోటీ చేయదలచినట్టు వివరించారు.

బీజేపీ జాతీయ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో పార్టీలోకి వచ్చిన రాజగోపాల్ రెడ్డి పార్టీపై విమర్శలు చేయడం దారుణం అని రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్  అన్నారు. రాజగోపాల్ రెడ్డికి పార్టీలో మంచి హోదా కల్పించిందని, అలాంటప్పుడు వ్యక్తిగతంగా ఇలా ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

click me!