నియంత్రిత సాగు రద్దు: తల తిక్క సీఎం అంటూ కేసీఆర్‌పై రాములమ్మ ఫైర్

Siva Kodati |  
Published : Dec 27, 2020, 09:22 PM ISTUpdated : Dec 27, 2020, 10:53 PM IST
నియంత్రిత సాగు రద్దు: తల తిక్క సీఎం అంటూ కేసీఆర్‌పై రాములమ్మ ఫైర్

సారాంశం

నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేయడంపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి. ఈ పిచ్చి నిర్ణయంతో రైతులకు నష్టం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

నియంత్రిత సాగు విధానాన్ని రద్దు చేయడంపై మండిపడ్డారు తెలంగాణ బీజేపీ నేత, సినీ నటి విజయశాంతి. ఈ పిచ్చి నిర్ణయంతో రైతులకు నష్టం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

తల తిక్క ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రైతులు నష్టపోయారని రాములమ్మ దుయ్యబట్టారు. రైతులకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని ఆమె ప్రశ్నించారు. రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్న కేసీఆర్‌.. రైతు బంద్ పెట్టి ఎందుకు సతాయించారని విజయశాంతి మండిపడ్డారు.  

కాగా, తెలంగాణలో నియంత్రిత సాగు విధానం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఇకపై రైతులు తమకు నచ్చిన పంట వేసుకోవచ్చని సర్కార్ స్పష్టం చేసింది. గ్రామాల్లో కూడా పంట కొనుగోలు కేంద్రాలను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

పంట కొనుగోలు ద్వారా మొత్తం రూ.7,500 కోట్లు నష్టం రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులు పంటను ఇష్టమొచ్చిన చోట అమ్ముకోవచ్చని తెలిపింది. కేంద్ర చట్టాలు సైతం రైతులు పంట ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 4 డిగ్రీల టెంపరేచర్..! ఈ 11 జిల్లాల్లో మూడ్రోజులు చలిగాలుల అల్లకల్లోలమే
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్