వీహెచ్ కామెంట్స్.. అధిష్టానం ఆగ్రహం, వివరణ ఇచ్చుకున్న హనుమంతన్న

By Siva KodatiFirst Published Dec 27, 2020, 8:24 PM IST
Highlights

టీపీసీసీ చీఫ్ ఎంపికపై స్పీడ్ పెంచింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్లను సంప్రదిస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్, కేసీ వేణుగోపాల్‌లు సంప్రదింపులు జరుపుతున్నారు

టీపీసీసీ చీఫ్ ఎంపికపై స్పీడ్ పెంచింది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ లీడర్లను సంప్రదిస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్, కేసీ వేణుగోపాల్‌లు సంప్రదింపులు జరుపుతున్నారు.

కోర్ కమిటీలోని ముఖ్యులతో టీపీసీసీ చీఫ్ నియామకంపై చర్చిస్తున్నారు. నిన్నా, ఇవాళ కొందరు సీనియర్‌లతో మాట్లాడారు. మరోవైపు వీ హనుమంతరావు.. ఠాగూర్‌పై చేసిన కామెంట్స్‌పైనా ఏఐసీసీ ఆరా తీస్తోంది.

దీనికి సంబంధించి వీహెచ్ వివరణ పంపారు. దురుద్దేశంతో తాను వ్యాఖ్యలు చేయలేదని.. తన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించిందని లేఖలో పేర్కొన్నారు. 

Also Read:రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు: వీహెచ్ మీద కాంగ్రెస్ అధిష్టానం సీరియస్

అంతకుముందు రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ పదవి ఇస్తే తాను కాంగ్రెస్ పార్టీలో ఉండనని సంచలన వ్యాఖ్యలు చేశారు వి.హనుమంతరావు. రేవంత్ రెడ్డికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇస్తే.. తనతో పాటు చాలామంది నేతలు పార్టీని వీడతారని స్పష్టం చేశారు.

పార్టీ కోసం పని చేసే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి వంటి వాళ్లు టీపీసీసీ చీఫ్ పదవికి పనికిరారా ? అని హనుమంతన్న ప్రశ్నించారు. తెలంగాణ వ్యతిరేకికి టీపీసీసీ ఎలా ఇస్తారంటూ వీహెచ్ నిలదీశారు. పదవులన్నీ కొత్త వాళ్లకు ఇస్తే.. మేం మాత్రం జైలు చుట్టూ తిరగాలా అని హనుమంతరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
 

click me!