బంధువుల హాస్పిటళ్ల కోసం.. ఆరోగ్యశ్రీ పక్కనబెట్టారా: కేసీఆర్‌పై విజయశాంతి విమర్శలు

By Siva KodatiFirst Published May 18, 2021, 3:06 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ నేత విజయశాంతి. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని కేసీఆర్ గాలికి వదిలేశారని ఆరోపించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు బీజేపీ నేత విజయశాంతి. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె.. రాష్ట్రంలో ప్రజారోగ్యాన్ని కేసీఆర్ గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రైవేటు హాస్పిటళ్లలో కోవిడ్ చికిత్స ఫీజులపై నియంత్రణ లేదని ఆమె మండిపడ్డారు.

ఫీజులు కట్టలేక ప్రజలు అల్లాడుతుంటే గడీలో ఉన్న దొరకు కరోనా బాధితుల హాహాకారాలు వినిపించడం లేదని రాములమ్మ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేసి ఉంటే కరోనా చికిత్సలో రూ.5లక్షల వరకు కేంద్రమే చెల్లిస్తుందని ఆమె హితవు పలికారు.

Also Read:కరోనా వ్యాక్సిన్‌, వెంటిలేటర్లను ఉపయోగించుకోలేదు: కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

ఈ స్కీంలో చేరనందుకు రాష్ట్రం రూ.200 కోట్లు కోల్పోయిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. తన బంధువులు, అనుచరుల హాస్పిటళ్లకు రోజూ కోట్లలో వస్తున్న ఆదాయాన్ని కాపాడేందుకే కేసీఆర్ ఆయుష్మాన్ భారత్‌ను, ఆరోగ్యశ్రీని అమలు చేయట్లేదా? అని రాములమ్మ ప్రశ్నించారు.

రాష్ట్రంలో ఆయూష్మాన్ భారత్‌ను అమలు చేయనందుకు నిరసనగా, ఆరోగ్య శ్రీలో కరోనాను చేర్చాలన్న డిమాండ్‌తో రేపు జరగబోతున్న “ గరీబోళ్ల కోసం బీజేపీ దీక్ష” ను విజయవంతం చేయాలని విజయశాంతి పిలుపునిచ్చారు. 

click me!