అంబులెన్స్‌ల అడ్డగింపు.. కేసీఆర్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలి: విజయశాంతి ఫైర్

By Siva KodatiFirst Published May 14, 2021, 4:01 PM IST
Highlights

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులను సరిహద్దుల వద్ద ఆపడంపై తెలంగాణ సర్కార్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న రోగులను సరిహద్దుల వద్ద ఆపడంపై తెలంగాణ సర్కార్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘ వైద్యం కోసం ఏపీ నుంచి హైదరాబాద్ వస్తున్న రోగుల అంబులెన్సులను సరిహద్దుల వద్దే అపేసి ఏ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్న తెలంగాణ పాలకుల తీరును అన్ని వర్గాలూ తప్పుబడుతున్నా ఈ సర్కారు స్పందించడం లేదు.

ఆస్పత్రులలో బెడ్స్ కన్ఫర్మ్ చేసుకుని, అందుకు రుజువులు చూపిస్తున్నా అనుమతించకపోవడం దారుణం. ఈ విషయంలో తెలంగాణ సర్కారు వైఖరిని ఇటీవలే నాతో సహా విపక్షాలన్నీ ఖండించాయి. సరిహద్దుల్లో అంబులెన్సులను అపే విషయమై ప్రభుత్వం నుంచి ఆదేశాలున్నాయా... అన్న హైకోర్టు ప్రశ్నకు సైతం అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు.

తెలంగాణ సర్కారు తీరుతో సరిహద్దుల వద్ద పలువురు రోగులు మృత్యుముఖానికి చేరువయ్యే పరిస్థితి నెలకొంది. ఈ దుస్థితికి గాను తెలంగాణ ముఖ్యమంత్రిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినా తప్పులేద’’ని విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Also Read:రాజ్యాంగం కంటే మీ సర్క్యులర్ గొప్పదా?: అంబులెన్స్ ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు సీరియస్

మరోవైపు రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో బెడ్ కన్ఫర్మేషన్ ఉంటేనే   ఇతర రాష్ట్రాల రోగులను అనుమతిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ పై  హైకోర్టు  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన గైడ్‌లైన్స్ ను సవాల్ చేస్తూ మాజీ ఐఆర్ఎష్ అధికారి వెంకట కృష్ణారావు శుక్రవారం నాడు తెలంగాణ హైకోర్టులో   పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. 
 

click me!