తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు..

By AN TeluguFirst Published May 14, 2021, 3:50 PM IST
Highlights

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. నిన్నటి ఉత్తర-దక్షిణ ద్రోణి/గాలి విచ్చిన్నతి ఈ రోజు బలహీన పడింది. దీంతో ఈరోజు ఉపరితల ద్రోణి విధర్బ దాని పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 15 కిలోమీటర్ల ఎత్తువరకు ఏర్పడింది.
 
నిన్న ఆగ్నేయ అరేబియా సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి లక్షద్వీప్ దాని పక్కనే ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా వాయుగుండంగా, ఈరోజు ఉదయం 8:30 నిమిషాలకు ఏర్పడింది. 

ఇది మరింత బలపడి రాగల 24 గంటల్లో తుఫానుగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత మొదట మరింత బలపడి, ఉత్తర ఈశాన్య దిశగా ప్రయాణించి, ఆ తరువాత దిశను మార్చుకుని ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించి గుజరాత్ తీరాన్ని18వ తేదీ ఉదయంకి చేరుకునే అవకాశం ఉంది.

ఈరోజు శుక్రవారం (14వతేదీ) తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు, ఎల్లుండి (15 16వ తేదీల్లో) తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశాలలో పడే అవకాశాలున్నాయి.

రాగల మూడు రోజుల్లో  (14,15,16వ.తేదీలు) ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.   ముఖ్యంగా రేపు, ఎల్లుండి తెలంగాణ జిల్లాల్లో తుఫాను ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వీటి ప్రభావం ఎక్కువగా ఉండబోతోందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 
 
click me!