కేటీఆర్ బ్యాచ్ ఒత్తిడి.. కేవీపీని పట్టుకున్న కేసీఆర్: షర్మిల పార్టీపై తెలంగాణ బీజేపీ స్పందన

By Siva KodatiFirst Published Feb 9, 2021, 4:52 PM IST
Highlights

షర్మిల కొత్త పార్టీపై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు తలో రకంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ...కేసీఆర్ తన కుర్చీని కాపాడుకోడానికి, తన స్థానాన్ని పదిలం చేసుకోడానికే తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతున్నారని ఆరోపించారు

షర్మిల కొత్త పార్టీపై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు తలో రకంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ స్పందించింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ...కేసీఆర్ తన కుర్చీని కాపాడుకోడానికి, తన స్థానాన్ని పదిలం చేసుకోడానికే తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెర లేపుతున్నారని ఆరోపించారు.

దీనిలో భాగంగానే షర్మిల కొత్త పార్టీ ప్రకటన అని ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను కాపాడడానికి కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు రంగం ప్రవేశం చేశారని, షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. షర్మిల కొత్త పార్టీ ప్రకటన అనేది ముమ్మాటికీ కేసీఆర్ కనుసన్నల్లో, కేవీపీ ఆలోచనలతోనే ముందుకు వెళ్తోందని ప్రభాకర్ వివరించారు. 

కేసీఆర్ కారుకూతలను తెలంగాణ ప్రజానీకం నమ్మే స్థితిలో లేదని ఆయన ఎద్దేవా చేశారు. తనయుడు, మంత్రి కేటీఆర్ భజన పరులు పెంచిన ఒత్తిడి మూలంగానే కేసీఆర్ ఈ కొత్త సమీకరణాలకు తెరలేపారని ప్రభాకర్ వ్యాఖ్యానించారు.

Also Read:ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణం: షర్మిలపై సీతక్క ఆసక్తికరం

మంత్రి కేటీఆర్ అనుచరుల ఒత్తిడిని తట్టుకోడానికి కేవీపీ సలహా, కాంగ్రెస్, కమ్యూనిస్టుల సహకారాన్ని కేసీఆర్ తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ ఎంత ప్రయత్నించినా, తెలంగాణ ప్రజానీకం మాత్రం ఆయన్ను నమ్మే స్థితిలో లేరని, కారుకు మబ్బులు కమ్ముకున్నాయని ప్రభాకర్ సెటైర్లు వేశారు.

టీఆర్‌ఎస్‌లో పుట్టిన ముసలాన్ని అధిగమించడానికే కేసీఆర్ కమ్యూనిస్టులను కలుపుకుంటున్నారని, కాంగ్రెస్‌కు లోపాయకారిగా మద్దతిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ అనేక సార్లు ఉప ఎన్నికలకు వెళ్లారని, ఇప్పుడు మధ్యంతర ఎన్నికలకు సిద్ధమేనా? అని ప్రభాకర్ సవాల్ విసిరారు. 

click me!