బీజేపీ ఎన్నికల కమిటీ భేటీ: అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

By Nagaraju TFirst Published Oct 18, 2018, 2:28 PM IST
Highlights

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల కమిటీ మెుదటిసారిగా సమాశమైంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీకేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మురళీధర్ రావుతోపాటు పలువురు కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. 

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల కమిటీ మెుదటిసారిగా సమాశమైంది. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీకేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి, మురళీధర్ రావుతోపాటు పలువురు కీలక నేతలు సమావేశానికి హాజరయ్యారు. ఈనెల మెుదటి వారంలో అభ్యర్థుల ఎంపికపై కోర్ కమిటీ నాలుగు రోజుల పాటు అభ్యర్థులతో చర్చించింది. 

అభిప్రాయ సేకరణలో వచ్చిన పేర్లను, దరఖాస్తులను కమిటీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు, 2014 ఎన్నికల్లో రెండో స్థానంలో ఉన్న నేతలలపూ ఎన్నికల కమిటీ కూలంకుషంగా పరిశీలిస్తోంది. నియోజకవర్గానికి ఒకే అభ్యర్థి దరఖాస్తు వచ్చిన వాటిపై కూడా కమిటీ అధ్యయనం చేస్తోంది.   

ఎన్నికల కమిటీ ముఖ్యంగా హైదరాబాద్, నిజామాబాద్ జిల్లాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను ఫైనల్ చేసినట్లు అలాగే మల్కాజ్ గిరి అభ్యర్థి ఎంపిక కూడా నేడే తేలనున్నట్లు తెలుస్తోంది. 

ఈనెల 19న బీజేపీ కేంద్ర పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల జాబితాను పంపి ఆమోదింప చేసుకునే యోచనలో బీజేపీ ఎన్నికల కమిటీ భావిస్తోంది. మెుత్తం తొలివిడతగా 30 మంది అభ్యర్థులను ఎంపిక చేసి ఆ జాబితాను కేంద్ర పార్లమెంటరీ బోర్డుకు పంపనుంది. ఈనెల 19న అభ్యర్థుల తొలిజాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. 

click me!