కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇవాళ మధ్యాహ్నం బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ బుధవారం నాడు మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైద్రాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ బస్సు యాత్రకు రాహుల్ ,ప్రియాంకలు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకలకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్లో రాహుల్, ప్రియాంకలు ములుగు బయలుదేరారు.
కాంగ్రెస్ బస్సు యాత్రను ఇవాళ ములుగులో ప్రారంభించనున్నారు కాంగ్రెస్ నేతలు. తొలుత రామప్ప ఆలయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ పత్రాలతో పూజలు నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత బస్సు యాత్ర నిర్వహిస్తారు. ఈ సందర్భంగానే మహిళా డిక్లరేషన్ ను ప్రియాంకగాంధీ విడుదల చేయనున్నారు. మహిళా డిక్లరేషన్ ను విడుదల చేసిన తర్వాత ప్రియాంకగాంధీ న్యూఢిల్లీకి వెళ్లిపోతారు. రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు రాష్ట్రంలోనే ఉంటారు. తెలంగాణలో బస్సు యాత్రలో రాహుల్ పాల్గొంటారు.
undefined
also read:సుధీర్ రెడ్డికి కాంగ్రెస్‌లోకి ఆహ్వానం: సముచిత గౌరవం కల్పిస్తానన్న రేవంత్ రెడ్డి
మూడు రోజుల పాటు బస్సు యాత్ర సాగుతుంది. మూడు రోజుల తర్వాత తొలి విడత బస్సు యాత్ర ముగియనుంది. ఆ తర్వాత మరో రెండు విడుతలుగా బస్సు యాత్రను నిర్వహించనున్నారు కాంగ్రెస్ నేతలు.బస్సు యాత్రను పురస్కరించుకొని పలు వర్గాలతో రాహుల్, ప్రియాంకగాంధీలు భేటీ కానున్నారు.ప్రజల సమస్యలను తెలుసుకొంటారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేయనుందో ఈ ఇద్దరు నేతలు వివరించనున్నారు.ఉత్తర తెలంగాణ ప్రాంతంలో భారత్ జోడో యాత్ర జరగలేదు. ములుగులో బస్సు యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుండి కొండగట్టు నుండి పాదయాత్ర ప్రారంభించాలని తొలుత ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాలతో బస్సు యాత్రను ములుగు నుండి ప్రారంభించాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15కు బదులుగా 18న బస్సు యాత్ర ప్రారంభించాలని రాష్ట్ర నేతలు నిర్ణయించారు.