ఆమనగల్లులో మహిళ దారుణ హత్య: పోలీసుల దర్యాప్తు

Published : Sep 15, 2021, 10:15 AM IST
ఆమనగల్లులో మహిళ దారుణ హత్య: పోలీసుల దర్యాప్తు

సారాంశం

రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మల్లేపల్లి శివారులో పోచమ్మ అనుమానాస్పదస్థితిలో మరణించింది. రోడ్డు పక్కనే మహిళ మృతదేహం పడి ఉంది. అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఆమనగల్:  రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మల్లేపల్లి శివారులో బుధవారం నాడు పోచమ్మ అనే మహిళ దారుణంగా హత్యకు గురైంది. మహిళను కత్తులతో దుండగులు చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.హతురాలు మాడుగుల మం. చంద్రానిపల్లి వాసిగా పోలీసులు గుర్తించారు. మృతురాలిపై అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోచమ్మను హత్య చేసి రోడ్డు పక్కనే వదిలివేసి వెళ్లారు దుండగులు.సంఘటన స్థలంలోని ఆనవాళ్ల ప్రకారంగా బాధితురాలిపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

 పోచమ్మను ఎవరు హత్య చేశారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రాంతంలోని సీసీటీవీలున్నాయా అనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Numaish : హైదరాబాద్ నడిబొడ్డున మరో అగ్నిప్రమాదం.. బయటపడ్డ షాకింగ్ నిజాలు ! నుమాయిష్ కు రావొద్దన్న సీపీ
Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?