టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికపై సంజయ్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Feb 11, 2021, 2:26 PM IST
Highlights

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందం మరోసారి బహిర్గతమైందన్నారు

జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్, ఎంఐఎం లోపాయికారి ఒప్పందం మరోసారి బహిర్గతమైందన్నారు.

మతతత్వ పార్టీ ఎంఐఎంకు టీఆర్ఎస్ చెంచా అని రుజువైందని సంజయ్ మండిపడ్డారు. జీహెచ్ఎంసీలో టీఆర్ఎస్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండటం ఖాయమని ఆయన ఆరోపించారు.

మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. ఇద్దరు దొంగలు కలిసి మేయర్ పీఠాన్ని చేజిక్కించుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. మేయర్ స్థానానికి పోటీ చేస్తామన్న ఎంఐఎం ఎందుకు పోటీ చేయలేదని ఆయన ప్రశ్నించారు.

Also Read:జీహెచ్ఎంసీ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నిక: టీఆర్ఎస్ కు ఎంఐఎం మద్దతు

టీఆర్ఎస్- ఎంఐఎం కలిసి పోటీ చేసుంటే 15 సీట్లు కూడా రాకపోయేవని రాజాసింగ్ అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం తమబొంద తామే తవ్వుకున్నాయన్నారు.

అంతకుముందు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక పూర్తయింది. జీహెచ్ఎంసీ మేయర్‌గా కే కేశవరావు కూతురు, బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మీ ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి ఎన్నికయ్యారు.

చేతులెత్తే విధానం ద్వారా వీరి ఎన్నిక జరిగింది. బీజేపీ నుంచి కూడా అభ్యర్థులను నామినేట్ చేశారు. కానీ, సరిపోయేంత బలం లేకపోవడంతో.. టీఆర్ఎస్ అభ్యర్థులు మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఎన్నికయ్యారు.

click me!