కేసీఆర్‌ నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్, కేంద్రంలో మేమూ పవర్‌లో వున్నాం: బండి సంజయ్

By Siva KodatiFirst Published Jan 5, 2022, 8:50 PM IST
Highlights

బీజేపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) జైలు నుంచి విడుదలయ్యారు. 317 జీవోను సవరించాలని కరీంనగర్ పట్టణంలో బీజేపీ చేపట్జిన జన జాగరణ దీక్షలో కోవిడ్ నిబంధనలు (covid rules) పాటించలేదని బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడ్రోజుల పాటు బండి సంజయ్ జైల్లోనే ఉన్నారు

బీజేపీ (bjp) తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) జైలు నుంచి విడుదలయ్యారు. 317 జీవోను సవరించాలని కరీంనగర్ పట్టణంలో బీజేపీ చేపట్జిన జన జాగరణ దీక్షలో కోవిడ్ నిబంధనలు (covid rules) పాటించలేదని బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మూడ్రోజుల పాటు బండి సంజయ్ జైల్లోనే ఉన్నారు

అయితే బండి సంజయ్‌ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో ఆయనను విడుదల చేయాల్సిందిగా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.  వ్యక్తిగత పూచీ 40 వేల బాండ్‌పై విడుదల చేయాలని జైళ్ల శాఖ డీజీని హైకోర్టు ఆదేశించింది. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని రిమాండ్‌కు ఆదేశాలివ్వడం సరికాదని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 7కు హైకోర్టు వాయిదా వేసింది. 

జైలు నుంచి విడుదలైన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. 317 జీవోను (go no 317) సవరించాలని మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల కోసమే జైలుకు వెళ్లానని... కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేస్తుంటే బీజేపీ కార్యాలయం ధ్వంసం చేశారని బండి సంజయ్ ఆరోపించారు. తనను అరెస్టు చేసి రాక్షాసానందం పొందుతున్నారు. ఉద్యోగులు భయపడొద్దని.. బీజేపీ అండగా వుంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నాయకులను నమ్మొద్దని.... వచ్చే ఎన్నికల్లో బీజేపీనే అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. 317 జీవో సవరించకపోతే, అవసరమైతే మరోసారి జైలుకు వెళ్లేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. 

Also Read:ఏ ప్రధానిని రోడ్డుపై ఆపలేదు, కేసీఆర్ రైతులకు ఏటీఎంలాంటివాడే: జేపీ నడ్డాపై కేటీఆర్ ఫైర్

ఉద్యోగాలు పోతే అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తమదేనని... ధర్మయుద్ధం ఇప్పుడే  మొదలైదంటూ బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ నీ గొయ్యి.. నువ్వే తవ్వుకుంటున్నావ్, బొడిగె శోభను ముందస్తు అరెస్టు ఎందుకు చేశారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్న కేసీఆర్‌ను (kcr) వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీరును హైకోర్టు తప్పుబట్టిందిని.. రూ.వేల కోట్లు దోచుకుని అవినీతి కుబేరులుగా మారారని సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా జైలుకు పంపుతున్నారని.. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటే.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని గుర్తు పెట్టుకోవాలి అని ఆయన హెచ్చరించారు. 

మరోవైపు మంగళవారం నాడు క్యాండిల్ ర్యాలీలో  జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తమ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బుధవారం నాడు టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు.  కేసీఆర్ అన్నదాతలకు తోడుండే మిషన్ అంటూ కేటీఆర్ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. అయినా కూడా ఈ ప్రాజెక్టును పూర్తి చేసిన తమను అభినందించకపోగా ఈ ప్రాజెక్టు కేసీఆర్ కు ఏటీఎం అంటూ జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ అదే స్థాయిలో సమాధానమిచ్చారు.  కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన తెలంగాణ ప్రభుత్వానికి నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని కేంద్ర జలవనరుల సంఘం సభ్యులు కితాబిచ్చిన విసయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. 

click me!