హైదరాబాద్‌లో మిస్సయ్యింది.. తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్స్ తప్పదు: బండి సంజయ్

By Siva KodatiFirst Published Dec 20, 2020, 7:55 PM IST
Highlights

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయాలతో టీఆర్ఎస్- బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘన విజయాలతో టీఆర్ఎస్- బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

తాజాగా సీఎం కేసీఆర్‌పై సంజయ్‌ విమర్శలు గుప్పించారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చనడం తప్పా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఫాంహౌస్‌లో దొడ్డు వడ్లు పండించి లాభం పొందారని, రైతులను సన్నాలు పండించమని ముంచాడని సంజయ్ మండిపడ్డారు.

కచ్చితంగా రెచ్చగొడుతా.. రెచ్చిపోయేలా చేస్తానని బండి స్పష్టం చేశారు. 80 శాతం ఉన్న హిందువుల కోసం పనిచేస్తామని బండి సంజయ్ తేల్చి చెప్పారు. హైదరాబాద్‌లో తమకు అవకాశం రాలేదని, తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని ఆయన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ప్రజలను పట్టించుకోని కేసీఆర్ మనకు అక్కర్లేదన్నారు. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలు.. ఎవరికీ సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వరని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ అర్ధరాత్రి వచ్చినా సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తారని ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రజలకు వాస్తవాలు వివరిస్తామని బండి సంజయ్ ప్రకటించారు.

click me!