మోడీ గొప్పతనం తెలుసా.. ఎందుకు తిడుతున్నారు: టీఆర్ఎస్ నేతలపై బండి సంజయ్ విమర్శలు

By Siva KodatiFirst Published Jul 3, 2022, 8:00 PM IST
Highlights

టీఆర్ఎస్ నేతలు ప్రధాని మోడీని ఎందుకు తిడుతున్నారని ప్రశ్నించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పులి వస్తుందంటే గుంట నక్కలు పారిపోతాయంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని నరేంద్ర మోడీపై టీఆర్ఎస్ నేతలు ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న విజయ సంకల్ప సభలో ఆయన మాట్లాడుతూ.. పులి వస్తుందంటే గుంట నక్కలు పారిపోతాయంటూ వ్యాఖ్యానించారు. మోడీని ఎందుకు తిడుతున్నారో టీఆర్ఎస్ నేతలు చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చినందుకా మోడీని తిడుతున్నారని ఫైరయ్యారు. 

పేద ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నందుకా మోడీని తిట్టడం అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్ధులను తీసుకొచ్చినందుకా మోడీని తిడుతున్నారని ఆయన ఫైరయ్యారు. దేశ ప్రజల పాలిట మోడీ దేవుడని సంజయ్ వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రం తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోందని.. రాజకీయ లబ్ధి కోసమే మోడీని కేసీఆర్ తిడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలని మోడీ పదే పదే చెబుతున్నారని సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ నేతలకు మోడీ గొప్పతనం తెలియడం లేదని.. కేంద్రాన్ని బద్నామ్ చేయాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని.. అందుకే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలని బండి సంజయ అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన బీజేపీ శ్రేణులు వెనక్కి తగ్గరని ఆయన స్పష్టం చేశారు. మరో 20 ఏళ్ల పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వమే వుంటుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. 

ALso Read:Vijaya Sankalpa Sabha : ఉసూరుమనిపించిన మోడీ స్పీచ్.. కేసీఆర్‌ పేరేత్తని ప్రధాని, నిరాశలో బీజేపీ శ్రేణులు

అనంతరం బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ పాలన పోవడం ,బీజేపీ పాలన రావడం ఖాయమన్నారు. ప్రియతమ నేత మోడీని చూసేందుకు ఇంతమంది పోతెత్తారని నడ్డా వ్యాఖ్యానించారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలు చూసి ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. కేసీఆర్ ను దించి బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారని జేపీ నడ్డా తెలిపారు. తెలంగాణలో కేసీఆర్ పాలన పోవడం, బీజేపీ పాలన రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చిందని నడ్డా అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను కేసీఆర్ ఏటీఎంలా మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్ కారులో కేసీఆర్ కుటుంబానికి తప్ప మరొకరికి చోటులేదని జేపీ నడ్డా విమర్శించారు. 
 

click me!