కేసీఆర్ ప్రభుత్వం కూలుతుంది, మధ్యంతర ఎన్నికలు తప్పవు: బండి సంజయ్

Siva Kodati |  
Published : Nov 28, 2020, 02:21 PM ISTUpdated : Nov 28, 2020, 02:25 PM IST
కేసీఆర్ ప్రభుత్వం కూలుతుంది, మధ్యంతర ఎన్నికలు తప్పవు: బండి సంజయ్

సారాంశం

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన వాడి వేడి వ్యాఖ్యలతో అలజడి రేపుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తన వాడి వేడి వ్యాఖ్యలతో అలజడి రేపుతున్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ వ్యాఖ్యానించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత అవినీతి ప్రభుత్వం కూలుతుందని ఆయన జోస్యం చెప్పారు. కేంద్రం అన్ని లెక్కలు తేల్చుతుందని.. అమిత్ షా వస్తున్నాడు, టీఆర్ఎస్‌ జాగ్రత్త అంటూ సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

భారత్ బయోటెక్‌కు కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. మళ్లీ చెబుతున్నా.. ఘాట్లను టచ్ చేస్తే దారుసలాంను కూల్చేస్తామని సంజయ్ వార్నింగ్ చేశారు. ఇంట్లో చెప్పే వచ్చానని చావుకు భయపడేది లేదని సంజయ్ స్పష్టం చేశారు.

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం