ఆయనకు ఫాంహౌస్‌లు, బ్యాంక్ అకౌంట్లు లేవు... బీఎల్ సంతోష్ జోలికొస్తే : బండి సంజయ్ వార్నింగ్

By Siva Kodati  |  First Published Nov 22, 2022, 6:54 PM IST

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. స్కామ్ నుంచి బయటపడేందుకే బీఎల్ సంతోష్‌ను అవమానిస్తున్నారని ... ఆయన జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు.


మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరంపై స్పందించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. బీఎల్ సంతోష్ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. బీఎల్ సంతోష్‌కి ఫాంహౌస్‌లు, బ్యాంక్ అకౌంట్లు లేవన్నారు. ఆయన జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంఘ్ ప్రచారక్‌లను కేసీఆర్ అవమానిస్తున్నారని.. రాష్ట్రాన్ని రక్షించడానికి సంఘ్ ప్రచారక్‌లు పనిచేస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. ఎంపీ , ఎమ్మెల్యే కావాలని బీఎల్ సంతోష్ అనుకోలేదన్నారు. స్కామ్ నుంచి బయటపడేందుకే బీఎల్ సంతోష్‌ను అవమానిస్తున్నారని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇప్పటికే ఫాంహౌస్‌ కేసులో బీఎల్ సంతోష్‌కు ఢిల్లీలోని ఆయన ఆఫీస్‌లో నోటీసులు అందజేశారు సిట్ అధికారులు. అయితే సిట్ ముందు హాజరయ్యేందుకు సమయం ఇవ్వాలని బీఎల్ సంతోష్ కోరారు. 

ఇకపోతే... మొయినాబాద్  ఫాం హౌస్  కేసులో ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసులో  జగ్గుస్వామికి మంగళవారంనాడు సిట్  లుకౌట్  నోటీసులు జారీ  చేసింది. ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో  నిన్న సిట్  విచారణకు    జగ్గుస్వామి,  బీఎల్  సంతోష్,  తుషార్ లు    హాజరు కావాల్సి  ఉంది.  ఈ  ముగ్గురు కూడా  విచారణకు  రాలేదు. ఈ  విషయమై  సిట్  అధికారులు  న్యాయ సలహ తీసుకోవాలని భావించారు. ఇవాళ  జగ్గుస్వామికి  లుకౌట్ నోటీసులు  జారీ  చేసింది.  అయితే  జగ్గుస్వామితో  పాటు  బీఎల్  సంతోష్  , తుసార్ లకు  కూడా  లుకౌట్   నోటీసులు  జారీ  చేసిందని  మీడియాలో  కథనాలు ప్రసారమయ్యాయి.  అయితే  ఈ ప్రచారంలో  వాస్తవం  లేదని  తేలింది. బీఎల్  సంతోష్ , తుసార్ లకు  లుకౌట్  నోటీసులు జారీ  చేశారని  తప్పుడు  వార్తలు  ప్రసారం చేయడంపై  బీజేపీ  నేతలు  మండిపడ్డారు. కొందరు  టీఆర్ఎస్  నేతలు  ఈ  విషయమై  సోషల్  మీడియాలో  తప్పుడు  ప్రచారం  చేస్తున్నారని  బీజేపీ నేతలు  మండిపడుతున్నారు. 

Latest Videos

ALso REad:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: రామచంద్రభారతి కేంద్రంగా సిట్ విచారణ

కాగా.. ఈ  ఏడాది  అక్టోబర్  26న  మొయినాబాద్  ఫాం హౌస్  లో ఎమ్మెల్యేల ను ప్రలోభాలకు  గురిచేస్తున్నారనే  ఆరోపణలతో  రామచంద్రభారతి,  సింహయాజీ,  నందకుమార్ లను  పోలీసులు  అరెస్ట్ చేశారు. తాండూరు  ఎమ్మెల్యే  పైలెట్  రోహిత్ రెడ్డి  ఫిర్యాదు  మేరకు  ఈ  ముగ్గురిని  పోలీసులు అరెస్ట్ చేశారు.  

click me!