శివాజీ విగ్రహం ఎందుకొద్దు... పోలీసుల అండతోనే హిందువులపై దాడులు: బోధన్ ఘటనపై బండి సంజయ్ స్పందన

Siva Kodati |  
Published : Mar 20, 2022, 05:28 PM IST
శివాజీ విగ్రహం ఎందుకొద్దు... పోలీసుల అండతోనే హిందువులపై దాడులు: బోధన్ ఘటనపై బండి సంజయ్ స్పందన

సారాంశం

బోధన్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణ వాతావరణంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు టీఆర్ఎస్ నేతలకు కొమ్ముకాస్తున్నారంటూ ఫైరయ్యారు. 

బోధన్‌లో (bodhan ) హిందువులపై దాడిని ఖండిస్తున్నామన్నారు తెలంగాణ బీజేపీ (bjp) అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay). హిందు యువకులపై ఎంఐఎం , టీఆర్ఎస్ (trs), పోలీసులు కలిసి దాడి చేశారని అన్నారు. బోధన్‌లో శివాజీ విగ్రహం పెట్టడం (chhatrapati shivaji) కోసం మున్సిపల్ కౌన్సిల్ ఆరు నెలల క్రితమే తీర్మానం చేసిందన్నారు. ఆ తీర్మానం ప్రకారం విగ్రహం పెడితే అడ్డుకుంటారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. రాళ్ల దాడి చేయడం మూర్ఖత్వమన్నారు. భైంసాలో జరిగినట్లే.. బోధన్‌లోనూ జరుగుతోందని ఆరోపించారు. 

హిందువులకు తాము అండగా వుంటామని బండి సంజయ్ స్పష్టం చేశారు. శివాజీ పాక్ నుంచి లేదా బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు వచ్చారా అని ఆయన ప్రశ్నించారు. శివాజీ విగ్రహం ఎందుకు పెట్టకూడదో సీపీ చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. నిజామాబాద్ సీపీ గతంలో ఎంపీ అవుతానని చెప్పాడని ఆయన గుర్తుచేశారు. సీఎం ఆశీస్సుల కోసం కొందరు ఐఏఎస్‌లు పనిచేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. పోలీసులు టీఆర్ఎస్ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

కాగా.. బోధన్‌‌లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనార్టీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోటుకు ఇరువర్గాల నాయకులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు  నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా ఇరువర్గాలు వినిపించుకోవడం లేదు. దీంతో బోధన్‌లో భారీగా పోలీసులు మోహరించారు. ఎటువంటి ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.

పరిస్థితి ఉద్రిక్తం.. 
ఈ క్రమంలోనే పలువురు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో అక్కడి పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు భోదన్‌లో 144 సెక్షన్‌ (144 section) విధించారు. అయితే బోధన్‌లో పరిస్థితి అదుపులోనే ఉందని సీపీ వెల్లడించారు. శివాజీ విగ్రహానికి అనుమతి లేదని చెప్పారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తే సహించబోమని హెచ్చరించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Daughter Kills Parents: ప్రేమ పెళ్లి విషాదం.. తల్లిదండ్రులను హతమార్చిన కూతురు | Asianet News Telugu
Medaram Sammakka Saralamma Jatara 2026 Begins | 4000 Special RTC Buses | Asianet News Telugu