కలసి పనిచేద్దాం: కాంగ్రెస్ సీనియర్లను కోరిన అద్దంకి, జగ్గారెడ్డితో భేటీ

Published : Mar 20, 2022, 05:11 PM IST
కలసి పనిచేద్దాం:  కాంగ్రెస్ సీనియర్లను కోరిన అద్దంకి,  జగ్గారెడ్డితో భేటీ

సారాంశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ల సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. ఈ సమావేశం ప్రారంభమైన తర్వాత అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతారాయ్ హాజరయ్యారు.అందరం కలిసి పనిచేయాలని కోరారు.

హైదరాబాద్: Congress  పార్టీ సీనియర్ల సమావేశంలో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి. సమావేశానికి తొలుత V.Hanumantha Rao  హాజరయ్యారు. ఆ తర్వాత Marri shashidhar Redddy,  Jagga Reddy తదితరులు వచ్చారు. సమావేశం ప్రారంభమైన తర్వాత మరికొందరు నేతలు వస్తారా అని ఎదురు చూశారు. కానీ నేతలు రాకపోవడంతో మధ్యాహ్నాం 12 గంటలకు సమావేశం ప్రారంభించారు.

ఈ సమావేశం ప్రారంభమయ్యే సమయానికి గాంధీ భవన్ లో పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ సీనియర్ల సమావేశాన్ని ప్రశ్నించారు. హరీష్ రావుతో సమావేశమైన వి. హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై వ్యూహాలను రచిస్తున్నారా అని ప్రశ్నించారు. సీనియర్ల సమావేశం పేరుతో పార్టీని నష్టపర్చొద్దని కూడా ఆయన సూచించారు.

ఆ తర్వాత అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, మానవతారాయ్ లు ఆశోక్ హోటల్ కు వచ్చారు. అందరం కలిసి పనిచేద్దామని దయాకర్ పార్టీ సీనియర్లను కోరారు. అయితే పార్టీ అంతర్గత విషయాలు తెలియవని ఈ విషయమై మాట్లాడొద్దని జగ్గారెడ్డి సహా కొందరు నేతలు దయాకర్ కు సూచించారు. దీంతో ఈ ముగ్గురు సమావేశం జరిగే ప్రాంతం నుండి బయటకు వచ్చారు. మరో వైపు  ఈ సమావేశం ముగిసిన తర్వాత అద్దంకి దయాకర్ తో జగ్గారెడ్డి భేటీ అయ్యారు.

ఈ సమావేశం  నిర్వహించవద్దని బోస్ రాజు ఫోన్ చేసి కొందరు సీనియర్లకు చెప్పారని సమాచారం. అయినా కూడా ఈ సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశం పార్టీకి వ్యతిరేకంగా నిర్వహించలేదని సమావేశం ముగిసిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి ప్రకటించారు. పార్టీని బలోపేతం చేసే విషయమై ఈ సమావేశంలో చర్చించినట్టుగా ఆయన చెప్పారు.
తామంతా పార్టీ విధేయులమన్నారు. గత మూడేళ్లుగా ఈ తరహ సమావేశాలు నిర్వహిస్తున్నామని శశిధర్ రెడ్డి వివరించారు.

తామంతా సోనియా, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పనిచేస్తామన్నారు మర్రి శశిధర్ రెడ్డి.  మరో వైపు రేవత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైరయ్యార. సంగారెడ్డిలో తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని సంగారెడ్డిలో గెలిపించాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేశారు. పార్టీని రక్షించుకొనేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. 

PREV
click me!

Recommended Stories

Uttam Kumar Reddy Pressmeet: కేసీఆర్ వ్యాఖ్యలనుతిప్పి కొట్టిన ఉత్తమ్ కుమార్ | Asianet News Telugu
KCR Press Meet from Telangana Bhavan:చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై కేసీఆర్ పంచ్ లు| Asianet News Telugu