నీ కొంపముంచేది ప్రభాకర్ రావే: కేసీఆర్‌‌కు బండి సంజయ్ హెచ్చరిక

Siva Kodati |  
Published : Feb 20, 2021, 06:01 PM IST
నీ కొంపముంచేది ప్రభాకర్ రావే: కేసీఆర్‌‌కు బండి సంజయ్ హెచ్చరిక

సారాంశం

గుర్రంపోడులో భూకబ్జాలతో పాటు గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు భరోసా ఇవ్వడానికే బీజేపీ తండాలోకి వెళ్లిందని బండి స్పష్టం చేశారు. 

గాయాలపాలైన పోలీసులకు క్షమాపణలు కూడా చెప్పామని.. అయినప్పటికీ బీజేపీ  కార్యకర్తలను హింసిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. నాగార్జున సాగర్ బహిరంగసభలో బీజేపీ కార్యకర్తలను వదిలిపెట్టొద్దని కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు.

ప్రభాకర్ రావు ఆస్తులు అన్నీ బయటపెడతామని.. కేసీఆర్ కొంప ముంచేది ప్రభాకర్ రావేనని బండి సంజయ్ పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌లో గిరిజనులే టీఆర్ఎస్‌కు బుద్ది చెబుతారని.. శాంతి భద్రతకు సమస్యలొస్తే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

Dasara Special Trains: గుడ్ న్యూస్ చెప్పిన భారతీయ రైల్వే.. దసరా బతుకమ్మ ప్రత్యేక రైళ్లు
Weather Update: బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలుల హెచ్చరికలు