119 స్థానాల్లో పోటీ చేయ్.. ఎన్ని చోట్ల డిపాజిట్ వస్తుందో చూద్దాం: అసదుద్దీన్‌కి బండి సంజయ్ సవాల్

By Siva KodatiFirst Published Feb 7, 2023, 5:15 PM IST
Highlights

ఇటీవల మంత్రి కేటీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మధ్య మాటల యుద్ధం నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. 119 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేయాలని.. అప్పుడు ఆ పార్టీకి డిపాజిట్లు వస్తాయో లేదో చూద్దామంటూ సెటైర్లు వేశారు. 

కాగా.. రెండు రోజుల క్రితం  అసెంబ్లీలో ఎంఐఎం  పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మంత్రి కేటీఆర్  మధ్య  మాటల యుద్ధం సాగింది . గవర్నర్  ప్రసంగానికి  ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై  ప్రసంగం  సమయంలో అక్బరుద్దీన్  ప్రసంగంపై  మంత్రి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం  చేశారు. బడ్జెట్ పై చర్చ సమయంలో ప్రసంగిస్తున్నట్టుగా  అక్బరుద్దీన్ తీరు ఉందన్నారు. ఏడురుగురు ఎమ్మెల్యేలున్న  ఎంఐఎంకు  ఇంత సమయం ఇస్తే  వందకు పైగా  ఎమ్మెల్యేలున్న తమ పార్టీకి ఎంత సమయం కేటాయించాలని  మంత్రి కేటీఆర్ స్పీకర్ ను కోరారు. 

ALso REad: మంత్రి కేటీఆర్ వ్యాఖ్యపై అక్బరుద్ధీన్ ఓవైసీ సంచలన ప్రకటన

దీనికి  అక్బరుద్దీన్  ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో  50 అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేస్తామని  ఆయన  ప్రకటించారు. అంతేకాదు  తమ పార్టీ  15 మంది ఎమ్మెల్యేలను గెలుస్తుందని  ఆయన ధీమాను వ్యక్తం  చేశారు.  వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో  పోటీ చేసే విషయమై తమ పార్టీ అధినేతతో  మాట్లాడుతానని కూడా అక్బరుద్దీన్  ఓవైసీపీ  అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.

click me!