ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు సింగిల్ బెంచ్ తీర్పు: సీజే అనుమతి తీసుకోవాలన్న హైకోర్టు

By narsimha lode  |  First Published Feb 7, 2023, 3:46 PM IST

 ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు తీర్పుపై మూడు వారాల స్టేపై   విచారణకు  సీజే  అనుమతి తీసుకోవాలని   హైకోర్టు తెలిపింది.రేపు హైకోర్టు ; ప్రధాన న్యాయమూర్తి నుండి  అనుమతి తీసుకుంటామని  అడ్వకేట్ జనరల్ చెప్పారు. 


హైదరాబాద్: ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసుపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిందా అని  తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.ఎమ్మెల్యేల  ప్రలోభాల  కేసులో సింగిల్ బెంచ్  ఉత్తర్వులను సుప్రీంకోర్టుకు  వెళ్లే వరకు   సస్పెన్షన్ లో  ఉంచాలని  హైకోర్టులో  తెలంగాణ ప్రభుత్వం   మంగళశారం నాడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు  చేసింది. ఈ పిటిషన్ పై  ఇవాళ మధ్యాహ్నం  హైకోర్టు విచారణ  ప్రారంభించింది.   ఈ కేసు విషయమై  సీబీఐ విచారణను ప్రారంభించిందా అని  హైకోర్టు అడిగింది.  ఈ  విషయమై  ఇంకా ఎప్ఐఆర్ నమోదు చేయలేదని  అడిషనల్   సొలిసిటర్ జనరల్  చెప్పారు. 

ఈ పిటిషన్ విచారణకు  ప్రధాన న్యాయమూర్తి  అనుమతి కావాలని  హైకోర్టు సింగిల్  బెంచ్ తెలిపింది.  అయితే  ఈ విషయాన్ని  ప్రధాన న్యాయమూర్తి అనుమతిని కోరుతామని  అడ్వకేట్ జనరల్  ప్రసాద్  తెలిపారు.  

Latest Videos

also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో సింగిల్ బెంచ్ తీర్పు: లంచ్ మోషన్ దాఖలు చేసిన కేసీఆర్ సర్కార్

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసుకు సంబంధించి  సీబీఐ అధికారులు  ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని  అడ్వకేట్ జనరల్  చెప్పారు.  సుప్రీంకోర్టుకు  వెళ్లేందుకు ఎంత సమయం పడుతుందని  అడ్వకేట్ జనరల్ ను  ప్రశ్నించింది హైకోర్టు. వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అడ్వకేట్ జనరల్ ప్రసాద్ తెలిపారు.   దీంతో  ఈ పిటిషన్ పై  రేపు విచారణ నిర్వహించనున్నారు. 

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను  సీబీఐకి అప్పగిస్తూ  సింగిల్ బెంచ్  ఉత్తర్వులను  డివిజన్ బెంచ్ లో  కేసీఆర్ సర్కార్  ఈ ఏడాది జనవరి  4వ తేదీన  సవాల్  చేసింది. ఈ పిటిషన్ పై  నిన్న  హైకోర్టు  డివిజన్ బెంచ్ తీర్పును వెల్లడించింది.  హైకోర్టు సింగిల్ బెంచ్  ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్  కూడా సమర్ధించింది.  

సింగిల్ జడ్జి  పరిధిలోని క్రిమినల్ కేసుల విచారణ తమ పరిధిలోకి  రాదని  నిన్న  డివిజన్ బెంచ్ పేర్కొంది. ఈ విషయమై  ఏదైనా ఉంటే  సుప్రీంకోర్టుకు వెళ్లాలని హైకోర్టు డివిజన్ బెంచ్   నిన్న  అడ్వకేట్ జనరల్  కు సూచించింది.  అయితే  తాము ఈ విషయమై సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లే వరకు  తీర్పు అమలును నిలిపివేయాలని  అడ్వకేట్  జనరల్  కోరారు. కానీ ఇందుకు   హైకోర్టు డివిజ్  బెంచ్ నిరాకరించింది .  దీంతో సింగిల్ బెంచ్ వద్ద   ఈ తీర్పుపై మూడు వారాల పాటు  స్టే విధించాలని కోరుతూ  కేసీఆర్ సర్కార్  పిటిషన్ దాఖలు  చేసింది. ఈ పిటిషన్ పై  ఇవాళ మధ్యాహ్నం  హైకోర్టు విచారణను ప్రారంభించింది.

click me!