బ్రేకింగ్: మహబూబాబాద్‌లో బండి సంజయ్ అరెస్ట్

Siva Kodati |  
Published : Apr 02, 2021, 06:27 PM ISTUpdated : Apr 02, 2021, 06:37 PM IST
బ్రేకింగ్: మహబూబాబాద్‌లో బండి సంజయ్ అరెస్ట్

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. సునీల్ నాయక్ అంత్యక్రియలకు వెళ్తుండగా ఆయనను అడ్డుకున్న పోలీసులు అనంతరం అదుపులోకి తీసుకున్నారు. నర్సంపేట్ వద్ద బండి సంజయ్‌ని అరెస్ట్ చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం మాట తప్పడంతోనే సునీల్ ఆత్మహత్య చేసుకున్నారని బండి సంజయ్ ఆరోపించారు.

నిరుద్యోగ భృతి కోసం కలెక్టరేట్లను ముట్టడిస్తే అక్రమ అరెస్ట్‌లు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. కమ్యూనిటీ, ఇంటికి నీళ్లు, నిధులు, నియామకాలు విడుదల చేసింది కేంద్రమేనని బండి సంజయ్ గుర్తుచేశారు. బీజేపీ హిందువుల పార్టీ అన్నారు. 

తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన బొడ్డ సునీల్ అనే యువకుడు శుక్రవారం ప్రాణాలు కోల్పోయాడు.

వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ సోమ్లా తండా చెందిన సునీల్ విద్యార్థులు, నిరుద్యోగ సమస్యలపై పోరాడేవాడు. ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరేళ్లు దాటినా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంతో సునీల్ మనస్తాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలోనే మార్చి 26వ తేదీన కాకతీయ యూనివర్శిటీ ప్రాంగణంలో పురుగుల మందు తాగేశాడు.

PREV
click me!

Recommended Stories

Kalvakuntla Kavitha Slams Government Over Regional Ring Road Land Acquisition | Asianet News Telugu
Revanth Reddy: లాగులో తొండలు విడిచి కొడతా కేటీఆర్ పై రేవంత్ రెడ్డి సెటైర్లు | Asianet News Telugu