Telangana: టీఆర్ఎస్ హైవోల్టేజీ డ్రామా.. మంత్రి హ‌త్య కుట్ర‌పై విచార‌ణ జ‌రిపించాలి: బండి సంజ‌య్

Published : Mar 04, 2022, 02:53 PM IST
Telangana: టీఆర్ఎస్ హైవోల్టేజీ డ్రామా.. మంత్రి హ‌త్య కుట్ర‌పై విచార‌ణ జ‌రిపించాలి: బండి సంజ‌య్

సారాంశం

Telangana: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపించాల‌ని రాష్ట్ర బీజేపీ చీఫ్‌, ఎంపీ బండి సంజ‌య్ ప్ర‌భుత్వాన్ని కోరారు.   

Telangana: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. దీనిపై పూర్తిస్థాయి విచార‌ణ జ‌రిపించాల‌ని రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) చీఫ్‌, పార్ల‌మెంట్ స‌భ్యులు (ఎంపీ) బండి సంజ‌య్ ప్ర‌భుత్వాన్ని కోరారు. హ‌త్య‌ల‌ను బీజేపీ ఎప్పటికీ ప్రోత్సహించదని లేదా సమర్థించదని ఆయ‌న ఉద్ఘాటించారు. ఓ మంత్రిపైనే కాదు, సామాన్యుడిపైనా హత్యాయత్నం జరిగినా బీజేపీ సహించద‌ని పేర్కొన్నారు. కుట్ర వెనుక గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ జరపడం తప్పనిసరి అని అన్నారు. ప్రతిపక్షాలు అత్యున్నత దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాలనీ, అసలు కుట్రను బయటపెట్టే వరకు విశ్రమించబోమని ఆయన అన్నారు.

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు పథకం పన్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) నాయకులు గత రెండు రోజులుగా హైవోల్టేజీ డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు. అయితే, “కథ, స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం విఫలమైంది. మంత్రిగారి అవినీతిని కప్పిపుచ్చేందుకే ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి మరిన్ని తప్పులు చేశారు’’ అని రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ విమ‌ర్శించారు. అలాగే, మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హత్య కుట్ర‌లోని ఈ మొత్తం ఎపిసోడ్‌లో కొందరు ఐపీఎస్ అధికారుల పాత్రపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. "టీఆర్‌ఎస్‌ను రక్షించే ప్రయత్నంలో ఈ అధికారులు చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజల దృష్టిలో తమ విలువను దిగజార్చుకుంటున్నారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు. వారు చట్టాన్ని ఉల్లంఘిస్తే, వారి స్వంత చర్యలకు వారు అంతిమ బాధితులు అవుతారు"  అని పేర్కొన్నారు.

డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా హత్య కుట్రలో ఎలా ప్రమేయం ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘సుధీర్ఘ కాలంగా ప్రజాజీవితంలో ఉంటూ దశాబ్దాలుగా మహబూబ్‌నగర్‌ అభివృద్ధికి పాటుపడ్డారు. నేతల ఇళ్లపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. జితేందర్ రెడ్డి రెండుసార్లు ఎంపీగా పనిచేశారని, గతంలో టీఆర్‌ఎస్‌లో పనిచేశారని బండి సంజ‌య్ అన్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు రెడ్డి ఎన్నిసార్లు హత్యకు పాల్పడ్డారో కేసీఆర్ వెల్లడించాలి అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్)లో గానీ, రిమాండ్ రిపోర్టులో గానీ తన సహోద్యోగుల పేర్లు లేవని బీజేపీ అధ్యక్షుడు చెప్పారు. అయినప్పటికీ టీఆర్‌ఎస్‌ నేతలు తమ పాత్ర ఉందంటూ ఆరోపిస్తున్నార‌ని మండిపడ్డారు. హత్యల‌ను బీజేపీ ఎప్పటికీ ప్రోత్సహించదని లేదా సమర్థించదని బండి సంజ‌య్ కుమార్ ఉద్ఘాటించారు. ఒక మంత్రిపైనే  కాకుండా సామాన్యుడిపై హత్యాయత్నం జరిగినా బీజేపీ సహించద‌ని అన్నారు. శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అవకతవకలపై ఫిర్యాదు చేస్తూ న్యాయస్థానాన్ని, భారత ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన వారినే హత్య కేసులో ఇరికించారని ఆయన ఎత్తిచూపారు.

వారికి భద్రత కల్పించాలని మానవ హక్కుల కమిషన్‌ కూడా ప్రభుత్వాన్ని ఆదేశించిందని గుర్తు చేశారు. ''సబ్ జ్యూడీస్‌లో ఉన్నందున నేను అంతకు మించి మాట్లాడలేను. న్యాయస్థానంలో వాస్తవాలు బయటకు వస్తాయి' అని సంజయ్ అన్నారు. అన్ని సర్వేలు బీజేపీకి పెరుగుతున్న ప్రజల మద్దతును సూచిస్తున్నందున, టీఆర్ఎస్‌.. బీజేపీని అబాసుపాలు చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌నీ,  శ్రీనివాస్ గౌడ్ చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నార‌ని ఆరోపించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు