కరోనా టీకా వేయించుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆయన భార్య

By telugu teamFirst Published Mar 3, 2021, 2:34 PM IST
Highlights

తెలంగాణ శానసశభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కరోనా వ్యాక్సిన్ డోస్ వేయించుకున్నారు. ఆయన సతీమణి కూడా కరోనా టీకా తీసుకున్నారు. కరోనా వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కూడా సంభవించవని ఆయన అన్నారు.

హైదరాబాద్. తెలంగాణ శానససభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి కరోనా వ్యాక్సిన్‌ మొదటి డోస్ వేయించుకున్నారు. రెండో దశ వ్యాక్సినేషన్‌లో భాగంగా బుధవారంనాడు నిమ్స్ ఆసుపత్రిలో టీకా తొలి డోసు వేయించుకున్నారు. అలాగే సభాపతి సతీమణి పుష్ప కూడా కరోనా టీకా వేయించుకున్నారు. 

అనంతరం స్పీకర్ పోచారం  మీడియా తో మాట్లాడారు. చైనాలో మొదలై ప్రపంచ వ్యాప్యంగా విస్తరించి లక్షల మంది మరణాలకు కారణమైనది కరోనా అని, ప్రపంచాన్ని గడగడలాడించిందని ఆయన అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగొనడంలో అమెరికా వంటి అగ్రరాజ్యాలు కూడా ఏమి చేయలేకపోయాయని అన్నారు. 

కాని మన తెలంగాణ రాష్ట్రంలోని భారత్ బయోటెక్ సంస్థ ప్రపంచంలోనే తొలిసారిగా వ్యాక్సిన్ ను కనుగొనడంతో పాటుగా అందుబాటులోకి తెచ్చిందని ప్రశంసించారు. ప్రపంచంలో ఉత్పత్తవుతున్న కరోనా వ్యాక్సిన్ లలో 60 శాతం తెలంగాణ గడ్డ మీదనే ఉత్పత్తవుతున్నాయని, ఇది మనందరికి గర్వకారణమని అన్నారు

సంవత్సరాలు దాటిన వారి కేటగిరిలో నేను ఈరోజు వ్యాక్సిన్ తీసుకున్నారని ఆయన చెప్పారు. భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకున్నానని చెప్పారు. తీసుకుని అరగంట అయిందని, ఇప్పటివరకు ఎలాంటి దుష్పరిణామాలు లేవని అన్నారు.ప్రజలు కరోనా వ్యాక్సిన్ విషయంలో అపోహలకు పోవద్దని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి విషయంలో తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని అన్నారు. దేశ సగటు కంటే తెలంగాణ రాష్ట్రంలో కరోనా మరణాలు అతి తక్కువ శాతంలో ఉన్నాయని చెప్పారు.. 

వ్యాక్సిన్ తీసుకున్నప్పటికి ప్రజలు అప్ర‌మ‌త్తంగా ఉండాలని చెప్పారు భౌతిక‌ దూరం పాటిస్తూ, మాస్కులు ధ‌రించాల‌న్నారు. కరోనాపై జరుగుతున్న పోరులో మొదటి నుండి ఫ్రంట్ వారియర్లుగా పోరాడుతున్న  డాక్టర్లు, న‌ర్సులు, మెడిక‌ల్ సిబ్బంది, పోలీసు శాఖ వారి కృషిని సభాపతి  అభినందించారు. 

కరోనా మహమ్మారిపై నిత్యం ప్రజలను అప్రమత్తంగా ఉంచతూ అవగాహన కల్పించడంలో క్రీయాశీలంగా వ్యవహరించిన మీడియాకు, పాత్రికేయులను స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారు. కరోనా టీకాను ఇచ్చిన బృందానికి ధన్యవాదాలు తెలిపారు. 

click me!