అడవిలోకి తీసికెళ్లి ప్రేయసిని చంపేసిన ప్రియుడు: కారణం ఇదీ...

Published : Mar 03, 2021, 12:46 PM IST
అడవిలోకి తీసికెళ్లి ప్రేయసిని చంపేసిన ప్రియుడు: కారణం ఇదీ...

సారాంశం

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో ఓ దారుణం జరిగింది. ప్రేయసిని ప్రియుడు అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి అక్కడ ఆమెను హత్య చేశాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వికారాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రేయసిని ఓ వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. తన వద్ద తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు ఆమెను అతను హత్య చేశాడు. 

వికారాబాద్ జిల్లా మాలాల మండలం పగిడ్యాల గ్రామానికి చెందిన బేగారి లక్ష్మి అనే మహిళ భర్త కొంత కాలం క్రితం మరణించాడు. భర్త మృతితో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో లక్ష్మి పద్దేముల్ మండలం బండమీదిపల్లి గ్రామానికి చెందిన నర్సింలుతో సహజీనం చేస్తోంది. 

కాగా, లక్ష్మి నర్సింలుకు 50 వేల రూపాయలు అప్పుగా ఇచ్చింది. అ డబ్బు తిరిగి ఇవ్వాలని లక్ష్మి నర్సింలుపై ఒత్తిడి పెడుతూ వస్తోంది. దాంతో లక్ష్మిని హత్య చేయాలని అతను నిర్ణయించుకున్నాడు. డబ్బు తిరిగి ఇస్తానని చెప్పి నర్సింలు లక్ష్మిని తన వెంట తీసుకుని వెళ్లాడు. నర్సింలు ఆమెను అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేశాడు. 

లక్ష్మి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నర్సింలును విచారించారు. విచారణలో అతను తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
Hyderabad రోడ్లకు ట్రంప్, రతన్ టాటా పేర్లు… రేవంత్ సర్కార్ కొత్త స్ట్రాటజీ ఏంటి?