పట్టపగలు.. మైనర్ బాలికపై కన్నేసిన ముగ్గురు యువకులు

Published : Mar 03, 2021, 12:59 PM IST
పట్టపగలు.. మైనర్ బాలికపై కన్నేసిన ముగ్గురు యువకులు

సారాంశం

తనకు పరిచయం ఉన్న ఓ యువకుడితో సోమవారం సాయంత్రం  టూ ఇంక్లైన్ సమీపంలోని దర్గా వద్ద మాట్లాడుతోంది. 

మైనర్ బాలికపై ముగ్గురు యువకులు కన్నేశాడు. ఎవరూ చూడకుండా పట్టపగలే బాలికపై లైంగిక దాడికి యత్నించారు. ఈ సంఘటన గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...  గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన బాలిక(16) తనకు పరిచయం ఉన్న ఓ యువకుడితో సోమవారం సాయంత్రం  టూ ఇంక్లైన్ సమీపంలోని దర్గా వద్ద మాట్లాడుతోంది. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు వారిపై దాడి చేశారు. బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా ఆమె కేకలు వేసింది.

స్థానిక యువకులు కొందరు గమనించి, గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు వాహనం రావడం గమనించిన నిందితులు యువతిని వదిలిపెట్టి పరారయ్యారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌బాబు, రాజ్‌కుమార్‌గౌడ్, క్రైం పార్టీ బృందం సభ్యులు బాధితురాలిని ఠాణాకు తీసుకెళ్లారు. 

వివరాలు తెలుసుకొని, ఆమె కుటుంబసభ్యులను పిలిపించారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. మంగళవారం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికి చెందిన నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని, విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!