ఆ వార్తలు బాధాకరం: కంటతడి పెట్టిన స్పీకర్ పోచారం

Siva Kodati |  
Published : Jun 07, 2020, 06:47 PM ISTUpdated : Jun 07, 2020, 06:52 PM IST
ఆ వార్తలు బాధాకరం: కంటతడి పెట్టిన స్పీకర్ పోచారం

సారాంశం

డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు.

డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద్వేగానికి గురై కంటతడి పెట్టారు. ఇళ్ల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారనే వార్తలు బాధాకరమన్న ఆయన.. ఇళ్ల ఎంపిక లాటరీ పద్ధతిలో జరుగుతుందని పోచారం స్పష్టం చేశారు.

కొందరికి ముందు రావొచ్చు... మరికొందరికి ఆలస్యం కావొచ్చనని స్పీకర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని.. పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడటానికే డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం చేపట్టిందని శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Also Read:రేపటి నుంచి యాదాద్రి, భద్రాద్రిల్లో దర్శనాలకు అనుమతి : ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే

ఆదివారం నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగర్గలో రూ.151 కోట్లతో నిర్మించిన 30 డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించారు. బాన్సువాడ నియోజకవర్గంలో రూ.500 కోట్లతో ఐదు వేల ఇండ్లు నిర్మిస్తున్నామని స్పీకర్ తెలిపారు.

Also Read:టెన్త్ పరీక్షల నిర్వహణపై 8న కేసీఆర్ సమీక్ష: ఎగ్జామ్స్ ఉంటాయా, పాస్ చేస్తారా?

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం ఎవరైనా డబ్బులు తీసుకుంటే అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి జలాలను నిజాంసాగర్‌కు తరలిస్తామని పోచారం చెప్పారు. నిజామాబాద్ నియోజకవర్గంలో ఏటా రెండు పంటలకు నీరందుతుందని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !