తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు

Published : Jan 05, 2019, 05:31 PM IST
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ముహూర్తం ఖరారు

సారాంశం

ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. ఆరోజు నుంచే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈనెల 17 నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలిసింది.   

హైదరాబాద్: ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కుదిరింది. ఆరోజు నుంచే శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కూడా జరగనున్నాయి. ఈనెల 17 నుంచి 20 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలిసింది. 

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డేట్స్ ఫిక్స్ అయిన నేపథ్యంలో ఈనెల 16న అసెంబ్లీలో ప్రోటెం స్పీకర్ గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజ్ భవన్ లో సాయంత్రం 5 గంటలకు ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఆ మరుసటి రోజు 17న ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అదేరోజు స్పీకర్ ఎన్నికకు సంబంధించి షెడ్యూల్ విడుదల కానుంది. ఈనెల 18న స్పీకర్ ఎన్నిక జరగనుంది. స్పీకర్ ఎన్నిక అనంతరం అదేరోజు బిఏసీ సమావేశం జరగనుందని తెలపింది. ఈనెల 19న శాసన సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఈనెల 20న గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉండబోతుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

తెలంగాణ ప్రోటెం స్పీకర్ ముంతాజ్: కేసీఆర్ కు అసద్ థ్యాంక్స్

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే