తప్పిన ప్రమాదం: కూలిన తెలంగాణ అసెంబ్లీ పాత భవనం గోడ

Published : Feb 23, 2021, 01:28 PM ISTUpdated : Feb 23, 2021, 01:58 PM IST
తప్పిన ప్రమాదం: కూలిన తెలంగాణ అసెంబ్లీ పాత భవనం గోడ

సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ప్రాంగంణంలో మంగళవారం నాడు పాత భవనం ప్రాకారం కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగంణంలో మంగళవారం నాడు పాత భవనం ప్రాకారం కూలిపోయింది. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.అసెంబ్లీ ప్రాంగణంలో విరిగిపోయిన తూర్పువైపున ఉన్న ప్రాకారం అంచు విరిగిపోయింది.విరిగిపోయిన ప్రాకారం అంచు పెచ్చులు కింద ఉన్న గార్డెన్ లో పడ్డాయి.

 

ఈ ప్రాకారం పడిన సమయంలో భారీ శబ్దం విన్పించినట్టుగా అక్కడ పనిచేస్తున్న సిబ్బంది తెలిపారు. రెండు మూడు రోజుల క్రితం వరకు ఈ ప్రాంతంలో నిర్మాణ పనులు జరుగుుతున్నాయి. కానీ ఇవాళ మాత్రం ఎవరూ కూడ ఈ ప్రాంతంలో పనిచేయలేదు.

పాత భవనానికి కొద్ది రోజులుగా మరమ్మత్తు పనులు నిర్వహిస్తున్నారు. భవనానికి రంగులు వేయడంతో పాటు దెబ్బతిన్న భవనాన్ని మరమ్మత్తు చేస్తున్నారు. ఈ సమయంలో భవనం ప్రాకారం అంచు కూలిపోవడంతో ఉద్యోగులు  భయాందోళనలకు గురయ్యారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇదే ప్రాంతంలో ఉంది. పాత అసెంబ్లీ భవనం కాకుండా కొత్త అసెంబ్లీ భవనాన్ని ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఉపయోగిస్తోంది.
 

PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu