తమ కేసు ఓడిపోయాడని.. లాయర్ తలకు తుపాకీ, కత్తితో పొడవబోయి...

By AN TeluguFirst Published Feb 23, 2021, 12:49 PM IST
Highlights

కోర్టులో కేసు ఓడిపోవడంతో.. లాయర్ ను చంపాలని కక్షిదారులు ప్రయత్నించిన దారుణం హైదరాబాద్ లో జరిగింది. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూ వివాదానికి సంబంధించిన ఓ కేసులో కక్షిదారులు ఓడిపోవడంతో దీనికి న్యాయవాదే కారణమని భావించి వాళ్లు ఈ దారుణానికి తెగబడ్డారు. 

కోర్టులో కేసు ఓడిపోవడంతో.. లాయర్ ను చంపాలని కక్షిదారులు ప్రయత్నించిన దారుణం హైదరాబాద్ లో జరిగింది. గతవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భూ వివాదానికి సంబంధించిన ఓ కేసులో కక్షిదారులు ఓడిపోవడంతో దీనికి న్యాయవాదే కారణమని భావించి వాళ్లు ఈ దారుణానికి తెగబడ్డారు. 

ఆ న్యాయవాదిపై హత్యాయత్నం చేశారు. దీనిమీద కేసు నమోదు చేసుకున్న నారాయణ గూడ పోలీసలు నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ ఘటన గతవారం జరుగగా, అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. 

హిమాయత్‌నగర్‌ స్ట్రీట్‌ నంబర్‌ 7లో ఉండే హైకోర్టు న్యాయవాది జశ్వంత్ ఓ భూ వివాదానికి సంబంధంచిన కేసు వాదిస్తున్నారు. ఈ కేసులో ఇటీవల కక్షిదారులకు వ్యతిరేకంగా తీర్పువచ్చింది. అయితే న్యాయవాది నిర్లక్ష్యం వల్లే తాము కేసు ఓడిపోయామని కక్షిదారులు భావించారు. 

అంతే ఈ విషయాన్ని మనసులో పెట్టుకుని.. ఈ నెల 17వతేదీ సాయంత్రం 6 గంటల సమయంలో గౌడ హాస్టల్ సమీపంలో న్యాయవాదిని అడ్డగించారు. అతనితో బాహాబాహికి దిగారు. భూ యజమాని తరఫు వాళ్లు తమ వెంట తెచ్చుకున్న తుపాకీని న్యాయవాది తలకు గురిపెట్టడంతో పాటు కత్తితో పొడిచేందుకు సిద్ధపడ్డారు. 

అయితే దీన్ని గమనిస్తున్న స్థానికులు ఫోన్లలో వీడియోలు తీస్తుండడంతో వాళ్లు వెనక్కు తగ్గారు. ఈ విషయాన్ని  స్థానికులు డయల్‌–100 కి ఫోన్ చేసి చెప్పడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. 

ఇరువైపుల వారినీ అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. అయితే గతవారం జరిగిన ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం, సెక్టార్‌ ఎస్సై కాకుండా మరొకరికి దర్యాప్తు బాధ్యతలు అప్పగించడం లాంటి చర్యలు అనేక అనుమానాలకు తావిస్తోంది.  

click me!