డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీజేపీని ఢీకొట్టేందుకు వ్యూహం ఖరారు చేసిన సీఎం కేసీఆర్

By team teluguFirst Published Nov 25, 2022, 9:36 AM IST
Highlights

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెలలో వారం రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ఆర్థిక విధానాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి కలిగిన నష్టాన్ని వివరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. 

డిసెంబర్ లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారం రోజుల పాటు కొనసాగే ఈ సమావేశాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు, దానిని ఢీకొట్టేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాం ఖరారు చేశారు. అనవసర ఆంక్షల కారణంగా రాష్ట్రానికి కలిగే నష్టాలపై కేంద్రంలోని అధికార బీజేపీని నిలదీయాలని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో మోడీ ప్రభుత్వం అవలంభించిన ఆర్థిక విధానాలు, రాష్ట్రాల భవిష్యత్తు, అభివృద్ధికి అవరోధంగా మారాయని చెప్పేందుకు సిద్ధమయ్యారు. 

నా అన్నతో పంచనామాపై బలవంతంగా సంతకం పెట్టించారు.. ఐటీ అధికారులపై భద్రారెడ్డి ఫిర్యాదు...

కేంద్ర ప్రభుత్వం అనవసర ఆంక్షలు విధించడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో రాష్ట్ర ఖజానాకు రూ.40,000 కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) గురువారం విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొంది. ఇలాంటి చర్యలతో కేంద్రం తెలంగాణ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తోందని ఆ ప్రకటనలో ప్రభుత్వం తెలిపిందని ‘డెక్కన్ క్రానికల్’నివేదించింది.

సాధారణంగా ప్రతీ ఆర్థిక సంవత్సరానికి ముందు కేంద్రం విడుదల చేస్తున్న బడ్జెట్ గణాంకాలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్రాలు తమ బడ్జెట్ ను రూపొందిస్తాయి. ఆనవాయితీ ప్రకారం.. ఆర్థిక వనరులను సమీకరించడానికి ప్రతీ రాష్ట్రానికి కేంద్రం ఎఫ్ఆర్ బీఎం పరిమితిని ప్రకటించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రానికి రూ.54,000 కోట్ల ఎఫ్ఆర్ బీఎం పరిమితిని కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022-23 సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులను సిద్ధం చేసింది. కాగా, కేంద్రం అకస్మాత్తుగా తెలంగాణ ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని రూ.39,000 కోట్లకు తగ్గించింది. ఫలితంగా తెలంగాణ రావాల్సిన రూ.15,000 కోట్లు తగ్గిపోయాయి.

ఢిల్లీలోని చాందినీ చౌక్ లో ఘోర అగ్నిప్రమాదం.. మంటలను ఆర్పుతున్న 40 ఫైర్ ఇంజన్లు..

అయితే ఆర్థికంగా బలమైన రాష్ట్రాలు ఎఫ్ఆర్బీఎం పరిమితి నుండి 0.5 శాతం అదనపు నిధుల సమీకరణను పొందడానికి అర్హత ఉంటుంది. బలమైన ఆర్థిక వృద్ధి సాధిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ వ్యతిరేక, రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల 0.5 శాతం అదనపు రుణ సదుపాయాన్ని పొందడాన్ని నిరాకరించినట్లు సీఎంఓ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. తెలంగాణ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి హాని కలిగించే కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలను మాత్రం తెలంగాణ ప్రభుత్వం అనుమించబోదని, దాని కోసం ఎలాంటి ఇబ్బందులునైనా భరించేందుకు సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ కేంద్రానికి గతంలోనే స్పష్టం చేశారు. ఫలితంగా రాష్ట్రం సుమారు రూ.6,000 కోట్లు నష్టపోయింది. దీని వల్ల రూ.21,000 కోట్లు (ఎఫ్ఆర్ బీఎం పరిమితిలో రూ .15,000 కోట్లు తగ్గింపు, అదనపు సమీకరణ ద్వారా రూ .6,000 కోట్లు) ఆగిపోయాయి. ఇది రాష్ట్రానికి గణనీయమైన నష్టంగా భావించవచ్చు.

మాణిక్యం ఠాగూర్‌పై వ్యాఖ్యలు.. మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెస్ లీగల్ నోటీసులు

దీనికితోడు రాష్ట్రానికి బడ్జెటేతర నిధుల రూపంలో వచ్చే రూ.20,000 కోట్ల విడుదలను కేంద్రం నిలిపివేసింది. అయితే దీనిపై సీఎంఓ తన ప్రకటనలో స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత విధానాలు, పూర్తి ఆర్థిక దుర్వినియోగంతో తీసుకున్న నిర్ణయాల కారణంగా తెలంగాణకు దాదాపు రూ.40,000 కోట్లు రాలేదని తెలిపింది. రాజకీయ ప్రేరేపిత, ప్రతీకార క్షీణత విధానాలతో రాష్ట్రాల గొంతులను అణచివేసి, రాష్ట్రాలకు హాని కలిగించడం ద్వారా కేంద్రం సమాఖ్య విధానాన్ని బలహీనపరుస్తోందని ఆ ప్రకటన పేర్కొంది. కేంద్రం అనుసరిస్తున్న ఇలాంటి అసంబద్ధ నిర్ణయాలను, అంశాలను రాష్ట్ర ప్రజలతో పాటు దేశ ప్రజల దృష్టికి తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా డిసెంబర్ లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ప్రజలకు పూర్తి సమాచారం అందించాలని నిర్ణయించినట్టు తెలిపింది. 

click me!