విజయశాంతికి కాంగ్రెస్ అదిరిపోయే ఆఫర్.. మరీ కాంగ్రెస్ కండువా కప్పుకోనేనా?

By Rajesh Karampoori  |  First Published Nov 4, 2023, 4:45 PM IST

Telangana Assembly Elections2023: బీజేపీ నాయకురాలు విజయశాంతి.. ఆమె గత కొంత కాలంగా పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటూ వస్తోంది. అసలూ ఆమె  కమలం పార్టీలోనే కొనసాగుతారా?  లేదా హస్తం పార్టీతో చేయి కలుతారా ? ఇంతకీ ఆమె అడుగు ఏటు వైపు ? అనే ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ బంఫర్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ ఆఫరేంటీ? 


Telangana Assembly Elections2023: తెలంగాణ మలి ఉద్యమంలో తనకంటూ ప్రత్యేక గుర్తుంపు సంపాదించుకున్న మహిళా నేత, ఫైర్ బ్రాండ్, బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) అలియాస్ రాములమ్మ. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తానే ప్రత్యేకంగా ఓ పార్టీని పెట్టి పోరు సాగించిన నాయకురాలు. కానీ తరువాత కాలంలో అప్పటి కాల ప్రభావాలను బట్టి తన పార్టీని  బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో వీలినం చేశారు. అనంతరం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.  కానీ, ఏమైందో తెలియదు గానీ.. అనూహ్యంగా గులాబీ పార్టీని వీడారు. కొంతకాలం తరువాత బీజేపీలో చేరారు. ఆమె కాషాయ పార్టీ కూడా కీలక నాయకురాలుగా పలు కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లారు. ఈ పార్టీలో కూడా తనకంటూ ప్రత్యేక ఛరిష్మా సంపాదించుకుంది.

ఇలాంటి నాయకురాలి రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారింది. అసలూ రాములమ్మ కమలం పార్టీలోనే  కొనసాగుతారా?  లేదా హస్తం పార్టీతో చేయి కలపలని భావిస్తోన్నారా? ఇంతకీ ఆమె అడుగు ఏటు వైపు వేయబోతున్నారు? ప్రశ్నలు వెల్లువెత్తున్నాయి. ఈ ఊహాగానాలు రావడానికి కారణాలు లేకపోలేదు. వాస్తవానికి గత కొన్నిరోజులుగా విజయశాంతి పార్టీ కార్యకలపాలకు దూరంగా ఉంటుంది. ఢిల్లీ పెద్దల బహిరంగం సభలలో కూడా పాల్గొనడం లేదు. పార్టీతో సంబంధం లేనట్టు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

అలాగే పలుమార్లు.. పార్టీ తీరుపై కూడా  అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్బాలు లేకపోలేవు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆమె కాషాయపార్టీకి ఉద్వాసన పలికి.. వేరే పార్టీలో చేరబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయినప్పటికీ  ఆ వార్తలన్నింటిని తిప్పికొట్టిన సంద్బరాలేవ్. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించిన దాఖలు కూడా లేవు. మరోవైపు.. బీజేపీని పరోక్షంగా వ్యతిరేకించినట్టు పోస్టు చేయడంతో ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చినట్టు అయ్యింది.  వాస్తవానికి  పార్టీలో తనకు కూడా సరైన స్థానం కల్పించకపోవడంతో ఆమె కూడా అయోమయంలో పడినట్టు తెలుస్తోంది. 

కొనసాగుతోన్న ఫిరాయింపుల పర్వం 

ఇదిలాఉంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాషాయ పార్టీ (బీజేపీ) పరిస్థితి కూడా అంత బాగాలేదు. ప్రారంభం నుంచే వరుసగా ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. మేనిఫేస్టో విడుదల, అభ్యర్థుల ప్రకటన పూర్తికాకముందే.. అసంత్రుప్తి నేతలు, సీటు ఆశించి భంగపడిన నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. ఈ ఫిరాయింపు పర్వానికి తొలుత మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి గోపాల్ రెడ్డి తెర తీయగా.. ఆ తరువాత వివేక్ వెంకటస్వామి .. కోమటి రెడ్డి బాటలో నడిచారు. వివేక్ పార్టీని వీడి వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఈ షాక్ నుంచి తెరుకోకముందే.. గంటల వ్యవధిలోనే బీజేపీ అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేశారు.

ఇలా ముఖ్య, సీనియర్ నేతలందరూ వీడుతుంటడంతో అసలు పార్టీ అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితిలో పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. ఈ తరుణంలో నెక్స్ట్ ఎవరు..? అనే సందేహం వెలువడుతోంది. ఆ జాబితాలో.. ఒకరు విజయశాంతి కాగా.. మరొకరు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి గా ప్రచారం జరుగుతోంది. అదేంటో.. యాదచ్ఛికమో కాకతాళీయమో తెలీదు కాని కమలం నీడను వదిలిన నేతలందరూ హస్తం గుటికే చేరుతున్నారు.  
 
వాస్తవానికి బండి సంజయ్‌ను అధ్యక్షుడి బాధ్యతలను తొలగించినప్పటి నుంచి విజయశాంతి దూరంగానే ఉంటున్నారు. అలాగే.. ఢిల్లీ నుంచి పెద్దలు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలు  పర్యటించినప్పడూ కూడా రాములమ్మ కనిపించలేదు. దీంతో విజయశాంతి.. పార్టీ మారిపోతారనే వార్తలు మొదలయ్యాయి. తాజాగా.. సినిమాల్లో లాగా రాజకీయాల్లో డబుల్ యాక్షన్ కుదరదని ట్వీట్ చేయడం కూడా చర్చనీయంగా మారింది. 

బంపరాఫర్..

మరోవైపు.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నుంచి రాములమ్మకు పిలుపు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆమె పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామ‌ని హైకమాండ్ హామీ ఇచ్చిన‌ట్టు సమాచారం. లోక్ సభలో అనుకున్న విధంగా ఫలితాలు వెలువడితే.. రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆమెకు మెద‌క్ సిట్మెంట్ నుంచి టికెట్ ఇస్తామనే కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రచారం ప్రకారం.. రాములమ్మ ఒకట్రెండు రోజుల్లో ఆమె కాషాయ పార్టీని వీడి.. కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని టాక్. ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవముందో  . తెలియాలంటే.. మనం కూడా వేచి ఉండాల్సిందే.. రానున్న రోజుల్లో రాములమ్మ ఎటు వైపు మొగ్గు చూపుతుందో వెయిట్  అండ్  సీ.  

click me!