సికింద్రాబాద్ ఆమెకు దక్కేనా: ఈ సీట్లు పెండింగులో ఎందుకంటే...

By pratap reddyFirst Published Nov 17, 2018, 11:41 AM IST
Highlights

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటి చేసిన కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేసిన సికింద్రాబాదు సీటును కాంగ్రెసు అధిష్టానం పెండింగులో పెట్టింది. ఈ సీటును హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తిక్ రెడ్డి ఆశిస్తున్నారు.

హైదరాబాద్: కాంగ్రెసు పెండింగులో పెట్టిన ఆరు సీట్లలో సనత్ నగర్ సీటుకు తెలుగుదేశం పార్టీ కూనం వెంకటేశ్ గౌడ్ కు కేటాయించినట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో మర్రి శశిధర్ రెడ్డికి కాంగ్రెసు నుంచి ఆ సీటు దక్కే అవకాశాలు లేవని అర్థమవుతోంది. ఇక మిగిలిన సీట్లను కూడా పొత్తుల సమస్యను పరిష్కరించుకునేందుకు పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్, మిర్యాలగూడ, దేవరకద్ర, మక్తల్, వరంగల్ ఈస్ట్ సీట్లు పెండింగులో ఉన్నాయి.

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటి చేసిన కూన వెంకటేశ్ గౌడ్ పోటీ చేసిన సికింద్రాబాదు సీటును కాంగ్రెసు అధిష్టానం పెండింగులో పెట్టింది. ఈ సీటును హైదరాబాద్ మాజీ మేయర్ బండ కార్తిక్ రెడ్డి ఆశిస్తున్నారు. తనకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివాసం వద్ద బైఠాయింపు కూడా జరిపారు. 

కాగా, మహబూబ్ నగర్ సీటును తెలుగుదేశం పార్టీ ఎర్ర శేఖర్ కు కేటాయించింది. అయితే ఈ సీటును తెలంగాణ జన సమితి (టిజెఎస్) ఆశిస్తోంది. దీంతో ఎర్ర శేఖర్ ను మక్తల్ కు మార్చి దాన్ని టిజెఎస్ కు కేటాయించే ఆలోచన జరుగుతున్నట్లు సమాచారం. దేవరకద్ర సీటును టీడీపి నేత సీతా దయాకర్ రెడ్డికి కేటాయించాలనే ఆలోచన కూడా సాగుతోంది. 

మిర్యాలగూడా సీటుకు కాంగ్రెసు సీనియర్ నేత జానా రెడ్డి మెలిక పెట్టారు. ఈ సీటును కూడా టీజెఎస్ ఆశిస్తోంది. ఈ సీటులో కోదండరామ్ పోటీ చేయాలని, లేదంటే టీజెఎస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి తనకు బంధువైన విజయేందర్ రెడ్డి పోటీకి దింపాలని జానా రెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో దాన్ని పెండింగులో పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, వరంగల్ ఈస్ట్ ను కూడా టీజెఎస్ ఆశిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గాదె ఇన్నయ్యకు ఆ సీటు కేటాయించాలని టిజెఎస్ భావిస్తోంది.

click me!