కేసీఆర్ పై బీజేపీ నుంచి పోటీపడేది ఎవరంటే...

Published : Nov 17, 2018, 11:29 AM ISTUpdated : Nov 17, 2018, 11:38 AM IST
కేసీఆర్ పై బీజేపీ నుంచి పోటీపడేది ఎవరంటే...

సారాంశం

 ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. కాగా.. బీజేపీ తమ పార్టీ తరపు నుంచి పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది.   

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడ్డాయి. వచ్చే నెలలో తెలంగణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు నేతలు నామినేషన్లు కూడా దాఖలు చేశారు. కాగా.. బీజేపీ తమ పార్టీ తరపు నుంచి పోటీచేసే అభ్యర్థుల నాలుగో జాబితాను విడుదల చేసింది. 

7 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఆ పార్టీ జాతీయ ఎన్నికల కమిటీ కార్యదర్శి, కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల విజయను సీఎం కేసీఆర్‌పై పోటీకి గజ్వేల్‌ నుంచి బరిలో నిలిపారు. 2014లో ఆమె సిరిసిల్ల నుంచి కేటీఆర్‌పై పోటీ చేశారు. 

ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితం టీఆర్‌ఎస్ ను వీడి బీజేపీలో చేరిన చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభ పేరు ఈ జాబితాలోనూ లేకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
 
అభ్యర్థులు వీరే: చెన్నూర్‌- ఎ.శ్రీనివాసులు; జహీరాబాద్‌-జంగం గోపి; గజ్వేల్‌- ఆకుల విజయ; జూబ్లీహిల్స్‌-శ్రీధర్‌రెడ్డి; సనత్‌నగర్‌-భవర్‌లాల్‌ వర్మ; పాలకుర్తి- సోమయ్య గౌడ్‌; నర్సంపేట- ఎడ్ల అశోక్‌రెడ్డి

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ