కాంగ్రెస్ లో సీట్ల లొల్లి: పార్టీ మారే యోచనలో మర్రి శశిధర్ రెడ్డి...?

By Nagaraju TFirst Published Nov 17, 2018, 11:25 AM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో జాబితాలో తన పేరు లేకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయినకు వరుసగా మూడు జాబితాల్లో చోటు దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మూడో జాబితాలో తన పేరు లేకపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నేత మర్రిశశిధర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయినకు వరుసగా మూడు జాబితాల్లో చోటు దక్కకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

రెండు జాబితాలో చోటు దక్కకపోయినా మూడో జాబితాలో అయినా చోటు దక్కుతుందని ఆశించానని అయితే తన పేరు లేకపోవడం బాధాకరమన్నారు. తన పేరు లేకపోవడంపై గుర్రుగా ఉన్న ఆయన తనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయంటూ ప్రకటించారు. నియోజకవర్గంలో తనకు కమిట్మెంట్స్ ఉన్నాయని తెలిపారు. కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేశారు.  

ముందస్తు ఎన్నికల్లో సనత్ నగర్ నియోజకవర్గం అభ్యర్థిగా మర్రి శశిధర్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ ఇంకా పెండింగ్ లోనే పెట్టింది. సనత్ నగర్ నియోజకవర్గంతో పాటు మరో 5 నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టింది. మాజీ ముఖ్యమంత్రి తనయుడిగా కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలందిస్తున్నారు మర్రి శశిధర్ రెడ్డి. 

అయితే మహాకూటమి పొత్తులో భాగంగా ఆయన టిక్కెట్ పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు బలాన్ని చేకూర్చేలా కాంగ్రెస్ పార్టీ మెుదటి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో ఆందోళన చెందారు. 

మెుదటి, రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో మూడో జాబితాలోనైనా తనకు సీటు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఢిల్లీలో రెక్కలు కట్టుకుని వాలిపోయారు. జాతీయ నాయకులతో మంచి సంబంధాలు ఉన్న మర్రి శశిధర్ రెడ్డి అందర్నీ ప్రసన్నం చేసుకున్నారు. 

మూడో జాబితాలో తనకు టిక్కెట్ వస్తుందని ఆశించారు. కానీ ఈసారి కూడా పెండింగ్ లో పెట్టడంతో ఆయన వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ అధిష్టానం దెబ్బతో మర్రి శశిధర్ రెడ్డి భవిష్యత్ కార్యచరణ ఏంటా అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

ఈ వార్తలు కూడా చదవండి

మర్రి శశిధర్ రెడ్డికి షాక్: కాంగ్రెసు మూడో జాబితా ఇదే...

click me!