Telangana Assembly Elections 2023: 30 శాతం ఓట్లు.. యువ‌త‌ను ప్ర‌సన్నం చేసుకునే పనిలో రాజ‌కీయ పార్టీలు

By Mahesh Rajamoni  |  First Published Sep 25, 2023, 4:38 PM IST

Hyderabad: ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయ పార్టీల‌న్ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి ఇప్ప‌టికే ప‌లు హామీలు ప్ర‌క‌టించాయి. అయితే, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఓట‌ర్ల‌లో యువ‌త 30 శాతం ఓటు షేర్ ను క‌లిగి ఉంది. దీంతో యువ‌త కోసం అన్ని రాజ‌కీయ‌ పార్టీలు ప్ర‌త్యేక హామీల‌ను సిద్ధం చేస్తున్నాయి.


Telangana Assembly Elections-Youth vote share: ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ క్ర‌మంలోనే రాజ‌కీయ పార్టీల‌న్ని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపున‌కు తిప్పుకోవ‌డానికి ఇప్ప‌టికే ప‌లు హామీలు ప్ర‌క‌టించాయి. అయితే, రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న ఓట‌ర్ల‌లో యువ‌త 30 శాతం ఓటు షేర్ ను క‌లిగి ఉంది. దీంతో యువ‌త కోసం అన్ని రాజ‌కీయ‌ పార్టీలు ప్ర‌త్యేక హామీల‌ను సిద్ధం చేస్తున్నాయ‌ని రాజ‌కీయ వర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

ఈ ఏడాది చివర్లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో యువత ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంది. తాజా ఎలక్టోరల్ రోల్ డేటా ప్రకారం ఏడు లక్షల మంది తొలిసారి ఓటర్లు ఓటర్లుగా చేరారు. 35 ఏళ్లలోపు ఓటర్లు 30% కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నందున, అన్ని పార్టీలు, అభ్యర్థులు ఈ సెగ్మెంట్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వారిని త‌మవైపున‌కు తిప్పుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తెలంగాణలోని 3.14 కోట్ల మంది ఓటర్లలో దాదాపు ఏడు లక్షల మంది 18-19 ఏళ్ల మధ్య వయస్కులే. అలాగే, 75 లక్షల మంది ఓటర్లు 19-35 ఏళ్ల మధ్య వయస్సు గ‌ల‌వారు ఉన్నారు.

Latest Videos

undefined

యువత ఎప్పుడూ ఓటు వేయడానికి ఉత్సాహంగా ఉన్నందున, పార్టీలు వారి కోసం ఏమి ఉంచాయో వారికి చెప్పడమే కాకుండా, యువకులకు ఎక్కువ టిక్కెట్లు కూడా ఇస్తాయని రాజకీయ విశ్లేషకులు ఎస్ఆర్ కృష్ణ చెప్పిన‌ట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఇంకో విష‌యం 2018 ఎన్నికల సమయంలో కూడా 18-19 ఏళ్ల గ్రూపులో ఏడు లక్షల మంది కొత్త ఓటర్లు ఓటరు జాబితాలో చేరారు. ఉద్యోగాలు, ఉపాధి క‌ల్ప‌న విష‌యంలో ఈ స‌మూహం ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ఈ యువ ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే 'యూత్ డిక్లరేషన్'ను ఆవిష్కరించింది. తమ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చింది.

మరోవైపు ప్రచారానికి బీజేపీ యూత్ ఐకాన్ మరెవరో కాదు ప్రధాని నరేంద్ర మోదీ. చాలా సాధారణ నేపథ్యం నుంచి ఎదిగిన ఆయన కావడంతో చాలా మంది యువకులు, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారు ఆయనతో మమేకమయ్యారు. ఇటీవల జరిగిన జీ20 సమావేశం, చంద్రయాన్-3 ప్రయోగం యువతను తెగ ఆక‌ర్షించాయి. అలాగే, 'అగ్నివీర్', 'మేక్ ఇన్ ఇండియా' వంటి పథకాలు కూడా ఉన్నాయి. పలు యువజన మోర్చాలను కూడా నిర్వహిస్తున్నారు.  ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ బీఆర్ఎస్ ను చెక్ పెట్ట‌డానికి యువతకు మేలు కంటే కీడే ఎక్కువ చేసిందని చెప్పడానికి కాంగ్రెస్, బీజేపీలు గ్రూప్-1 పరీక్షతో పాటు ప‌లు ప‌రీక్ష‌ల ర‌ద్దు, పేపర్ల లీకేజీని ఎత్తిచూపుతున్నాయి. బీఆర్ఎస్ యువ‌త కోసం ఎలాంటి హామీల‌తో ముందుకు వ‌స్తుందో చూడాలి మ‌రి.. ! 

click me!