MLC: గవర్నర్ తమిళిసై పై ఎమ్మెల్సీ మధుసూదనాచారి.. ‘ఆ అధికారం గవర్నర్‌కు లేదు’

Published : Sep 25, 2023, 04:21 PM IST
MLC: గవర్నర్ తమిళిసై పై ఎమ్మెల్సీ మధుసూదనాచారి.. ‘ఆ అధికారం గవర్నర్‌కు లేదు’

సారాంశం

తమిళిసై సౌందరరాజన్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను తిరస్కరించడంపై ఎమ్మెల్సీ మధుసూదనాచారి మండిపడ్డారు. క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం గవర్నర్‌కు లేదని పేర్కొన్నారు.  

హైదరాబాద్: ఎమ్మెల్సీ మధుసూదనాచారి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పై మండిపడ్డారు. దాసోజు శ్రవణ్, కుర్రా సత్యానారయణ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను గవర్నర్ తిరస్కరించడం అప్రజాస్వామికం అని ఆగ్రహించారు. దేని ఆధారంగా వీరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించే అధికారం గవర్నర్‌కు లేదని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జులై 31న జరిగిన మంత్రివర్గ సమావేశంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దాసోజ్ శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణను పంపాలని నిర్ణయం జరిగింది. వీరిద్దరినీ ఎమ్మెల్సీ అభ్యర్థులగా ప్రతిపాదిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీలు ఫారూక్ హుస్సేన్, రాజేశ్వర రావుల పదవీ కాలం ముగియడంతో వారి స్థానాల్లో ఈ ఇద్దరిని ఎంచుకున్నారు.

Also Read: రూ. 2000 నోట్ల మార్పిడికి 5 రోజులే గడువు.. ఈ విషయాలు తెలుసుకోండి

అయితే.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్  క్యాబినెట్ నిర్ణయాన్ని తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని ఎమ్మెల్సీ మధుసూదనాచారి తప్పుపట్టారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
School Holidays : నెక్ట్స్ వీక్ లో వరుసగా రెండ్రోజులు సెలవులు ఖాయం.. మరో రెండ్రోజులు కూడానా?