Telangana Assembly Elections 2023 : కాంగ్రెస్ లో చేరిన తీన్మార్ మల్లన్న

By Arun Kumar P  |  First Published Nov 8, 2023, 1:26 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నారు. తాజాగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. 


హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అధికార బిఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం కోసం ప్రయత్నిస్తుంటే... ప్రతిపక్ష కాంగ్రెస్, బిజెపి లు మొదటిసారి అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అందుకు తగ్గట్లుగానే ప్రధాన పార్టీలన్నీ ఎత్తులు పైఎత్తులు, వ్యూహప్రతివ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇందులో భాగంగా తమ పార్టీ విజయానికి పనికివస్తారని భావిస్తే ప్రత్యర్థి పార్టీ నాయకులనైనా బ్రతిమాలో, ఏదైనా ఆశచూపో తమ పార్టీలోకి లాక్కుంటున్నారు. అలాంటిది ఇండిపెండెంట్ పోటీచేసి పార్టీ విజయాన్ని దెబ్బతీస్తారనే వారిని వదిలిపెడతారా... ఏదోటి చేసి టక్కున తమపార్టీలో చేర్చుకుంటున్నారు. ఇలా గతంలో బిజెపిలో కొనసాగి ప్రస్తుతం తటస్థంగా వున్న తీన్మార్ మల్లన్న తమకు అవసరమని కాంగ్రెస్ భావించినట్లుంది... దీంతో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనుకున్న ఆయనను చేర్చుకోవడంలో ఆ పార్టీ నాయకులు సక్సెస్ అయ్యారు. 

తీన్మార్ మల్లన్న గుర్తింపుపొందిన చింతపండు నవీన్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్ట్ మాణిక్ రావ్ ఠాక్రే సమయంలో మల్లన్న కాంగ్రెస్ లో చేరారు. ఈ చేరిక కార్యక్రమంల టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి పరశీలకులు బోసు రాజు పాల్గొన్నారు. 

Latest Videos

బిజెపిని వీడిన తర్వాత తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. అధికారికంగా ఆ పార్టీలో చేరకున్నా పరోక్షంగా కాంగ్రెస్ అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరి మేడ్చల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు. అందుకోసం మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీతో చర్చలు కూడా జరిపినట్లు రాజకీయ ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో తెలీదుగానీ తీన్మార్ మల్లన్నకు కాకుండా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన వజ్రేశ్ యాదవ్ కు మేడ్చల్ టికెట్ దక్కింది.  

Read More  పటాన్‌చెరు, నారాయణఖేడ్ టిక్కెట్లు: జగ్గారెడ్డి, దామోదర మధ్య వైరం,ఎత్తుకు పై ఎత్తులు

దీంతో కాంగ్రెస్ లో పార్టీలో చేరి మేడ్చల్ లో పోటీ చేయాలకున్న తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. కానీ అనూహ్యంగా పోటీనుండి తప్పుకున్న మల్లన్న కాంగ్రెస్ లో చేరారు. బిఆర్ఎస్ పార్టీ, మంత్రి మల్లారెడ్డి వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా వుండేందుకే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ లో చేరినట్లు తెలుస్తోంది. 

ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన తీన్మార్ మల్లన్న మంచి ఓట్లే సాధించారు. బిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి గట్టి పోటీఇచ్చి రెండోస్థానంలో నిలిచారు. బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే మల్లన్నకు పట్టభద్రులు భారీసంఖ్యలో ఓట్లు వేసారు.  

click me!