కలిసి పోటీకి లెఫ్ట్ పార్టీల నిర్ణయం: ఈ నెల 27 తర్వాత మరోసారి భేటీ

By narsimha lode  |  First Published Aug 22, 2023, 5:05 PM IST


సీపీఐ, సీపీఎం నేతలు  ఇవాళ సమావేశమయ్యారు. ఈ నెల  27వ తేదీ తర్వాత మరోసారి  ఈ రెండు పార్టీల నేతలు సమావేశం కానున్నారు.
 


హైదరాబాద్: సీపీఐ, సీపీఎం నేతలు  హైద్రాబాద్ లో మంగళవారంనాడు సమావేశమయ్యారు. హైద్రాబాద్ సీపీఐ కార్యాలయానికి  సీపీఎం నేతలు వచ్చారు.  సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం,  సీపీఎం నేతలు  చరుపల్లి సీతారాములు, జూలకంటి రంగారెడ్డిలు   సీపీఐ నేతలతో  సమావేశమయ్యారు. ఇవాళ ఉదయం  సీపీఎం కార్యాలయంలో  ఆ పార్టీ నేతలు సమావేశమయ్యారు. అదే సమయంలో సీపీఐ  కార్యాలయంలో  సీపీఐ నేతలు భేటీ అయ్యారు.  

వేర్వేరుగా తమ కార్యాలయాల్లో  సమావేశాలు ముగించుకున్న తర్వాత  రెండు పార్టీల నేతలు సమావేశమయ్యారు. రెండు పార్టీలు రానున్న ఎన్నికల్లో  పోటీ చేయాలని  నిర్ణయం తీసుకున్నాయి. అయితే  ఈ విషయమై రేపు సీపీఐ రాష్ట్ర కార్యవర్గంలో, ఈ నెల  27న సీపీఎం రాష్ట్ర కార్యవర్గంలో చర్చించనున్నారు.  ఈ నెల  27వ తేదీ తర్వాత రెండు పార్టీల నేతలు  మరోసారి భేటీ కానున్నారు.

Latest Videos

తెలంగాణ సీఎం  కేసీఆర్  నిన్న  115  అభ్యర్థులతో  జాబితాను విడుదల చేశారు. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ పరిణామంతో లెఫ్ట్ పార్టీలు షాక్ కు గురయ్యాయి.  బీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీల మధ్య  పొత్తు ఉంటుందని  భావించారు. అయితే  115 అభ్యర్థుల జాబితా ప్రకటనతో  లెఫ్ట్ పార్టీలతో  పొత్తు లేదని  తేలింది . దీంతో  ఇవాళ సీపీఐ, సీపీఎం నేతలు సమావేశమయ్యారు. 

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో  సీపీఐ, సీపీఎంలు  బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించాయి.  వచ్చే ఎన్నికల్లో   సీపీఐ, సీపీఎంలకు ఒక్కో అసెంబ్లీ సీటు కేటాయించనున్నట్టుగా  బీఆర్ఎస్ నుండి  ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ విషయమై  కేసీఆర్ తో చర్చలకు  లెఫ్ట్ పార్టీలు ప్రతిపాదించాయి. కానీ, ఈ సమావేశం జరగలేదు. బీఆర్ఎస్ నాయకత్వం  అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దీంతో  లెఫ్ట్ పార్టీల నేతలు  ఇవాళ సమావేశమయ్యారు.

 


 

click me!