ఈ నెల 25న సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ: కాంగ్రెస్ రెండో జాబితాకు ఆమోదం తెలిపే చాన్స్

By narsimha lode  |  First Published Oct 23, 2023, 10:25 PM IST


రెండు మూడు రోజుల్లో  కాంగ్రెస్ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది.  ఈ నెల  25న  జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో  కాంగ్రెస్ జాబితాకు  ఆమోదముద్ర పడే అవకాశం లేకపోలేదు.



హైదరాబాద్: ఈ నెల  25న కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం న్యూఢిల్లీలో జరగనుంది.ఈ సమావేశంలో తెలంగాణలో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాకు  కాంగ్రెస్ నాయకత్వం  ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను  కాంగ్రెస్ పార్టీ ఈ నెల  15న విడుదల చేసింది.  ఈ నెల  25న కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం నిర్వహించనున్నారు.ఎలక్షన్ కమిటీ సమావేశం కంటే ముందుగానే  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ నెల 21, 22 తేదీల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగింది.ఈ నెల  22న జరిగిన సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరు కాలేదు.

Latest Videos

undefined

దీంతో లెఫ్ట్ పార్టీలతో పొత్తులకు సంబంధించి  ఈ సమావేశంలో  చర్చించారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి ముందుగానే మరోసారి కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో  కాంగ్రెస్ పార్టీ రెండో జాబితాపై చర్చించనున్నారు. రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను  ఎలక్షన్ కమిటీకి సిఫారసు చేయనుంది. ఇదిలా ఉంటే  లెఫ్ట్ పార్టీలతో సీట్ల సర్ధుబాటుపై ఇంకా స్పష్టత  రావాల్సి ఉంది.

 సీపీఐ, సీపీఎంలకు  రెండేసీ అసెంబ్లీ స్థానాలను  కేటాయించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. అయితే  ఏ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలనే దానిపై లెఫ్ట్ పార్టీల మధ్య  పొత్తుల చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి.  చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ స్థానాలను  సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది.  చెన్నూరుకు బదులుగా  మునుగోడు తీసుకోవాలని  సీపీఐకి చెందిన నల్గొండ జిల్లా నేతలు కోరుతున్నారు.

also read:న్యూఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: అభ్యర్థుల జాబితాపై కసరత్తు

మిర్యాలగూడతో పాటు ఖమ్మంలోని వైరా అసెంబ్లీ సీటును సీపీఎంకు కేటాయించేందుకు కాంగ్రెస్ సానుకూలంగా ఉంది. అయితే  పాలేరు  లేదా  రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్టణం అసెంబ్లీ సీటును  ఇవ్వాలని కాంగ్రెస్ ను సీపీఎం కోరుతుంది. ఈ విషయమై మూడు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

ఇద్దరు, ముగ్గురు ఒకే అసెంబ్లీ సీటు కోసం పోటీ పడుతున్న  స్థానాలు రెండో జాబితాలో ఉన్నాయి. కాంగ్రెస్ రెండో జాబితా ప్రకటించిన తర్వాత టిక్కెట్టు దక్కని  నేతలు ఏ రకంగా స్పందిస్తారోననేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

click me!