హరీష్ అడ్రస్ గల్లంతే... గద్దె దింపేవరకు నిద్రపోను..: దేవుడిపై ఒట్టేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే శపథం (వీడియో)

Published : Aug 21, 2023, 01:33 PM ISTUpdated : Aug 21, 2023, 01:46 PM IST
హరీష్ అడ్రస్ గల్లంతే... గద్దె దింపేవరకు నిద్రపోను..: దేవుడిపై ఒట్టేసి బిఆర్ఎస్ ఎమ్మెల్యే శపథం (వీడియో)

సారాంశం

మంత్రి హరీష్ రావుపై సొంత పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. సిద్దిపేటలో హరీష్ అడ్రస్ గల్లంతు చేయడం ఖాయమంటూ హెచ్చరించారు. 

హైదరాబాద్ : తెలంగాణ బిఆర్ఎస్ నాయకుల మధ్య టికెట్ల పంచాయితీ చిచ్చు పెడుతోంది. టికెట్ల ఆశిస్తున్న నాయకులు, వారి అనుచరుల మద్య మాటల సాగుతోంది. కేవలం రాజకీయంగానే కాదు వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతున్నారు. ఇలా బిఆర్ఎస్ పార్టీలో కీలక నాయకుడు, సీఎం కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావుపై మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజకీయంగా హరీష్ ను దెబ్బతీస్తానంటూ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసిమరీ హెచ్చరించారు ఎమ్మెల్యే మైనంపల్లి. 

ఉమ్మడి మెదక్ జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ వ్యవహారాలను హరీష్ రావు చూసుకుంటారు. దీంతో అతడు సూచించిన వారికే ఉమ్మడి జిల్లాలో టికెట్లు దక్కే అవకాశాలున్నాయి. అయితే మెదక్ నియోజకవర్గంలో తన తనయున్ని బరిలోకి దించడానికి మైనంపల్లి హన్మంత రావు సిద్దమయ్యారు. కానీ మంత్రి హరీష్ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే తిరిగి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నారట. దీంతో హరీష్ పై కోపంతో రగిలిపోతున్న మైనంపల్లి తాజాగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. 

వీడియో

మెదక్ నియోజకవర్గంలో హరీష్ పెత్తనం ఏమిటని ఎమ్మెల్యే మైనంపల్లి ప్రశ్నించారు. అసలు మెదక్ అభివృద్దిని అడ్డుకున్నదే హరీష్ అని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో మల్కాజ్ గిరి నుండి తాను, మెదక్ నుండి కొడుకు రోహిత్ పోటీ చేస్తామని మైనంపల్లి అన్నారు. కేసీఆర్ కుటుంబంలో చాలామందికి టికెట్లు ఇచ్చుకున్నారు కదా... అలాగే తమ కుటుంబంలో కూడా ఇద్దరికి టికెట్లు ఇవ్వాలని మైనంపల్లి కోరారు. 

Read More  ఇక చాలు.. ఆపు.. :హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కు క్లాస్ పీకిన మంత్రి హరీష్ రావు...

మంత్రి హరీష్ రావుకు తప్పకుండా బుద్దిచెబుతానని మైనంపల్లి హెచ్చరించారు. సిద్దిపేటలో హరీష్ అడ్రస్ గల్లంతు చేయడం ఖాయమంటూ వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసిమరీ చెప్పారు మైనంపల్లి. ఈసారి తనకు టైమ్ లేదు కాబట్టి వదిలిపెడుతున్నా... తర్వాత సిద్దిపేటపై దృష్టి పెడతానని అన్నారు.  తప్పకుండా హరీష్ రావును గద్దెదింపి దుకాణం  బంద్ చేయించేవరకు నిద్రపోనని ఎమ్మెల్యే మైనంపల్లి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 

ఇదిలావుంటే బిఆర్ఎస్ పార్టీకి చెందిన మరికొందరు నాయకులు టికెట్ల కోసం అదిష్టానంతో అమీతుమీకి సిద్దమయ్యారు. ఇలా భూపాలపల్లి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకట్రమణా రెడ్డికే మళ్లీ అవకాశం ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించకూడదని మాజీ స్పీకర్ మదుసూధనాచారి వర్గం నిర్ణయించింది. అంతేకాదు గండ్రను ఓడించడానికి 150‌-200 మంది ఉద్యమకారులను బరిలోకి దించుతామని ప్రకటించారు. కాబట్టి మదుసూధనాచారికి టికెట్ ఇస్తే బిఆర్ఎస్ పార్టీని గెలిపించుకుంటామని ఆయన అనుచరులు అంటున్నారు. 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిట్టింగ్ ఎమ్మెల్యే హరిప్రియకు ఈసారి బిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే కేసీఆర్ నిర్ణయమైతే తాము చాలా సంతోషిస్తామని... తాము కోరుకునేది కూడా ఇదేనంటూ కొందరు ఇల్లందు బిఆర్ఎస్ నాయకులు అంటున్నారు. 

ఇక ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి కూడా టికెట్ దక్కకపోవచ్చని... అలాగని ఈ టికెట్ ఆశిస్తున్న జిహెచ్ఎంసి మాజీ మేయర్ కు కూడా ఆ  అవకాశం దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ స్థానం నుండి  మాజీ ఎమ్మెల్యే  బండారి లక్ష్మారెడ్డి  పేరును బీఆర్ఎస్  నాయకత్వం  పరిశీలిస్తుందనే  ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, మాజీ మేయర్ ఒక్కటై తమ ఇద్దర్లో ఎవరో ఒకరికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు.

ఎస్సీ రిజర్వుడ్ జహిరాబాద్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్ రావుపై ప్రజా వ్యతిరేకత దృష్ట్యా ఇటీవలే బిఆర్ఎస్ లో చేరిన నరోత్తంకు టికెట్ ఇవ్వాలని అదిష్టానం భావిస్తోందట. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు ఆందోళన నెలకొంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?