తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ,జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి.ఏపీలో మాత్రం ఎన్‌డీఏలో ఉన్నప్పటికీ టీడీపీతో జనసేన కలిసి పోటీ చేస్తుంది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్నాయి. అయితే టీడీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది. తెలంగాణలో ఈ దఫా 32 స్థానాల్లో పోటీ చేస్తామని నెల రోజుల క్రితమే జనసేన ప్రకటించింది. అయితే తెలంగాణ ఎన్నికల్లో తమకు మద్దతివ్వాలని ఈ నెల 18న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను కోరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కోరారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు కనీసం 20 అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని బీజేపీని జనసేన కోరుతుంది. అయితే జనసేనకు 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు బీజేపీ సానుకూలంగా ఉంది.
undefined
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పవన్ కళ్యాణ్, కిషన్ రెడ్డి తదితరులు నిన్న న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య పొత్తు విషయమై చర్చించారు. రెండు పార్టీలు తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతామని టీడీపీ కూడ ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయనున్నాయి. ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్నప్పటికీ టీడీపీతో జనసేన పొత్తును ప్రకటించింది. ఇదిలా ఉంటే తెలంగాణలో మాత్రం బీజేపీ, జనసేనలు కలిసి పోటీ చేయనున్నాయి. కానీ టీడీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేయనుంది. తెలంగాణలో టీడీపీ బలం నామమాత్రమే. అయితే తెలంగాణలోని 40కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపనున్నారు. చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ చేయడంతో తెలంగాణలోని హైద్రాబాద్ సహా పలు జిల్లాల్లో ఆందోళనలు నిర్వహించిన విషయం తెలిసిందే. హైద్రాబాద్ లో ఐటీ ఉద్యోగులు మెరుపు ఆందోళనలు నిర్వహించారు.చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ నేతలు కూడ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ పై తమ పార్టీ నేతల స్పందన వారి వ్యక్తిగతమైందని కేటీఆర్ ప్రకటించారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన రంగం సిద్దం చేసిన సమయంలో బీజేపీ మద్దతు కోరింది. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతు ప్రకటించింది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా కచ్చితంగా పోటీ చేస్తామని జనసేన తేల్చి చెప్పింది. బీజేపీ, జనసేన మధ్య సీట్ల షేరింగ్ పై చర్చలు జరగనున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే లక్ష్యంతో బీజేపీ ఉంది. దీంతో జనసేనతో కలిసి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయం తీసుకుంది. జనసేనతో కలిసి పోటీ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ అభిమానుల ఓటు బ్యాంక్ తమకు కలిసి వస్తుందని కమలదళం భావిస్తుంది.
also read:జనసేన, టీడీపీ, బీజేపీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ:ఏపీలో ఆ కూటమిలో బీజేపీ చేరేనా?
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి. కానీ, తెలంగాణలో మాత్రం జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. తెలంగాణలో పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత ఈ విషయాన్ని ప్రకటిస్తామని కాసాని జ్ఞానేశ్వర్ రెండు రోజుల క్రితం ప్రకటించారు.ఏపీలో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్న జనసేన మాత్రం తెలంగాణలో మాత్రం టీడీపీకి దూరంగా ఉంటుంది.