Patancheru assembly result 2023 : పటాన్ చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజయం!

Published : Dec 03, 2023, 02:30 PM ISTUpdated : Dec 04, 2023, 10:17 AM IST
Patancheru assembly result 2023 : పటాన్ చెరులో బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజయం!

సారాంశం

పటాన్ చెరు నియోజకవర్గం బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నుండి గట్టి పోటీ ఎదుర్కున్న బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి విజయం సాధించారు.   

పటాన్ చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. గూడెం మహిపాల్ రెడ్డి స్వల్ప ఆధిక్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ పై ఆయన విజయం సాధించారు.ఇక్కడ చతుర్ముఖ పోరు చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థిగా నందీశ్వర్ గౌడ్, సీపీఎం తరపున జె. మల్లికార్జున్ ఎన్నికల బరిలో నిలిచారు. ఫైనల్ రౌండ్ ముగిసే నాటికి బీఆర్ఎస్ అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి 7091 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 

మొత్తంగా కాంగ్రెస్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ దాటింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అధికార బీఆర్ఎస్ 39 స్థానాలకు పరిమితమైంది. పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమిపాలయ్యారు. రాష్ట్రంలో పుంజుకున్న బీజేపీ 8 స్థానాల్లో గెలుపొంది ప్రభావం చూపింది. జనసేన ఘోర ఓటమి మూటగట్టుకుంది. కూకట్ పల్లి మినహాయిస్తే 7 చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయింది. ఎమ్ఐఎమ్ తన 7 నియోజకవర్గాలు కాపాడుకుంది. 

ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్

PREV
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu