తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ నేపధ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే..ఇక్కడ ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుందో తెలుసుకుందాం..
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.
ఈ నేపధ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ బీఆర్ఎస్ వైపే ఓట్లర్లు మొగ్గు చూపారు. అందరి అంచనాలును తలకిందులు చేస్తూ ఇక్కడ బీఆర్‌ఎస్ దూసుకెళ్తోంది. ఉమ్మడి మెదక్ లో 10 స్థానాలు ఉండగా.. ఆరింటిలో గులాబీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు.
undefined
Medak Assembly Election Results: మెదక్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!
నెం. | నియోజకవర్గం | గెలుపొందిన అభ్యర్ధి | పార్టీ |
1 | సిద్దిపేట | తన్నీర్ హరీష్ రావు | బీఆర్ఎస్ |
2 | మెదక్ | మైనంపల్లి రోహిత్ | కాంగ్రెస్ |
3 | నారాయణఖేడ్ | సంజీవ్ రెడ్డి | కాంగ్రెస్ |
4 | ఆందోల్ (ఎస్సీ) | దామోదర రాజనర్సింహ | కాంగ్రెస్ |
5 | నరసాపూర్ | సునీత లక్ష్మారెడ్డి | బీఆర్ఎస్ |
6 | జహీరాబాద్ (ఎస్సీ) | మాణిక్ రావు | బీఆర్ఎస్ |
7 | సంగారెడ్డి | చింతా ప్రభాకర్ | బీఆర్ఎస్ |
8 | పటాన్ చెరు | గుడేం మహిపాల్ రెడ్డి | బీఆర్ఎస్ |
9 | దుబ్బాక | కొత్త ప్రభాకర్ రెడ్డి | బీఆర్ఎస్ |
10 | గజ్వేల్ | కే. చంద్రశేఖర్ రావు(కేసీఆర్) | బీఆర్ఎస్ |