తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం..
తెలంగాణ ఎన్నికల్లో (Telangana Election Results 2023)కాంగ్రెస్ (Congress) ఘన విజయం సాధించింది. అధికారం చేపట్టేందుకు అవసరమైన స్థానాలకు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో పార్టీ నుంచి 64 మంది అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. కాగా బీఆర్ఎస్ పార్టీ 41 స్థానాలకు పరిమితం అయింది. మరోవైపు బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.
ఈ నేపధ్యంలో వరంగల్ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం.. ఏ పార్టీ ఎన్ని స్థానాలను కైవసం చేసుకుంది. ఏ నియోజకవర్గంలో ఎవరు గెలిచారు అనే విషయాలు చూద్దాం.. ఉమ్మడి వరంగల్ జిల్లా ఓటర్ నాడి పరిశీలిస్తే.. ఇక్కడ మిశ్రమ స్పందన వచ్చింది. ఉమ్మడి వరంగల్ లో 12 స్థానాలు ఉండగా.. 10 స్థానాలను కాంగ్రెస్ హస్త గతం చేసుకోగా.. గులాబీ పార్టీ(బీఆర్ఎస్) కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది.
Warangal Assembly Election Results: ఉమ్మడి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాల వారీగా గెలుపొందిన వారి జాబితా ఇదే!
నెం. | నియోజకవర్గం | గెలుపొందిన అభ్యర్ధి | పార్టీ |
1 | జనగాం | పల్లా రాజేశ్వర్ రెడ్డి | బీఆర్ఎస్ |
2 | స్టేషన్ ఘనపూర్ (ఎస్సీ) | కడియం శ్రీహరి | బీఆర్ఎస్ |
3 | పాలకుర్తి | యశస్విని రెడ్డి | కాంగ్రెస్ |
4 | డోర్నకల్ (ఎస్టీ) | జే రామ్ చంద్రు నాయక్ | కాంగ్రెస్ |
5 | మహబూబాబాద్(ఎస్టీ) | మురళి నాయక్ | కాంగ్రెస్ |
6 | నర్సంపేట | దొంతి మాధవ రెడ్డి | కాంగ్రెస్ |
7 | పరకాల | రేవూరి ప్రకాశ్ రెడ్డి | కాంగ్రెస్ |
8 | వరంగల్ పశ్చిమ | నాయిని రాజేందర్ రెడ్డి | కాంగ్రెస్ |
9 | వరంగల్ తూర్పు | కొండా సురేఖ | కాంగ్రెస్ |
10 | వర్ధన్నపేట (ఎస్టీ) | కేఆర్ నాగరాజ్ | కాంగ్రెస్ |
11 | భూపాలపల్లి | సత్యనారాయణరావు | కాంగ్రెస్ |
12 | ములుగు (ఎస్టీ) | అనసూయ (సీతక్క) | కాంగ్రెస్ |